Cinema city of Hyderabad: హైదరాబాద్: నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో 1500-2000 ఎకరాల విస్తీర్ణంలో సినిమా సిటీ నిర్మిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( CM KCR ) ప్రకటించారు. సినీ ప్రముఖులతో పాటు సంబంధిత అధికారుల బృందం బల్గేరియా వెళ్లి అక్కడి సినిమా సిటీని ( Cinema city in Bulgaria ) పరిశీలించిన అనంతరం సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
సినీ ప్రముఖులు చిరంజీవి ( Chiranjeevi ), నాగార్జున శనివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు ( Chiranjeevi and Nagarjuna met CM KCR ). ఈ సందర్భంగా తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై జరిగిన చర్చలో అనేక కీలక అంశాలు చర్చకొచ్చాయి. ‘‘తెలంగాణలో చిత్ర పరిశ్రమ ఆధారంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 లక్షల మంది ఆధారపడి జీవిస్తుండగా.. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల ఓవైపు షూటింగులు ఆగిపోయాయి. మరోవైపు థియేటర్లు మూతపడ్డాయి. దీంతో భారీ సంఖ్యలో జనం ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్నారనే అంశాలన్నీ ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకొచ్చాయి.
Also read : Samantha hosting Sam Jam: 'సామ్ జామ్' అంటున్న సమంత
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని, తెలంగాణలో కరోనావైరస్ రికవరీ రేటు 91.88 శాతంగా ఉంది అని అన్నారు. ''కోవిడ్ నిబంధనలు ( COVID-19 protocols ) పాటిస్తూ షూటింగులు పునఃప్రారంభించి, థియేటర్లు తెరిస్తే చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతికే కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతాయి'' అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
సీఎం కేసీఆర్ సూచనలపై చిరంజీవి, నాగార్జున ( Nagarjuna ) స్పందిస్తూ.. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోనే షూటింగులు ప్రారంభించామని.. త్వరలోనే థియేటర్లు కూడా ప్రారంభించడానికి ( Theatres opening ) ఏర్పాట్లు జరిగిపోతున్నాయని తెలిపారు.
Also read : Bigg Boss Telugu 4: ఎలిమినేషన్ ప్రమాదంలో ఎవరున్నారు ?
'' కాస్మో పాలిటన్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి- విస్తరణకు అనేక అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్ని భాషలకు చెందిన వారు హైదరాబాద్‌లో స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎవరినైనా అక్కున చేర్చుకునే గుణం హైదరాబాద్ సొంతం. అందుకే హైదరాబాద్‌లోనే సినిమా షూటింగులతో పాటు సినిమా నిర్మాణానికి అవసరమైన అన్ని ప్రక్రియలను అందించగలిగితే.. హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుంది, సినీ పరిశ్రమపై ఆధారపడిన వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయని కేసీఆర్ అన్నారు.
సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ ( Cinema city of Hyderabad ) నిర్మించాలనే తలంపుతో ఉన్న ప్రభుత్వం అందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇస్తుందని, అందులో అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్టూడియోలు నిర్మించుకునేందుకు చిత్ర నిర్మాణ సంస్థలకు స్థలం కేటాయిస్తుంది అని సీఎం కేసీఆర్ తెలిపారు. సినిమా షూటింగ్స్‌తో పాటు సినిమా సిటీ అవసరాలకు అనుగుణంగా ఎయిర్ స్ట్రిప్ ( Airstrip ) వంటి మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వమే సమకూరుస్తుంది'' అని సీఎం కేసీఆర్ తెలిపారు.
Also read : Telangana Covid-19: కొత్తగా 1,607 కరోనా కేసులు
ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బొయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు జొగినేపల్లి సంతోష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, శేషాద్రి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe