న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు రాష్ట్రీయ లోక్ సమత పార్టీ(ఆర్ఎల్ఎస్పీ)కి ముందుగా నమోదు చేసుకున్న సీలింగ్ ఫ్యాన్ గుర్తునే కొనసాగించాల్సి ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ఆ పార్టీకి స్పష్టంచేసింది. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఉపేంద్ర కుశ్వాహనే రాష్ట్రీయ లోక్ సమత పార్టీ అధ్యక్షుడిగా గుర్తించడం జరుగుతుందని ఎన్నికల సంఘం మరోసారి పునరుద్ఘాటించింది.
రాష్ట్రీయ లోక్ సమత పార్టీకి ఎన్నికల సంఘం జారీచేసిన ఈ ఆదేశాల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.