DOT Alert: ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ఆన్‌లైన్ చెల్లింపుల్లో మోసాలు, బ్యాంకు ఖాతాల్నించి ఫోన్ నెంబర్ సహాయంతో డబ్బులు తస్కరించడం వంటివి పెరిగిపోతున్నాయి. ఈ సైబర్ ఫ్రాడ్‌ను నియంత్రించేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ చర్యలు చేపట్టింది. ఏకంగా 1.4 లక్షల మొబైల్ నెంబర్లను నిషేధించింది.
డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ అంచనాల ప్రకారం 35 లక్షల సంస్థలు బల్క్ ఎస్ఎంఎస్‌లు పంపిస్తున్నాయి. వీటిలో19,776 సంస్థలు ఫేక్ ఎస్ఎంఎస్‌లు పంపిస్తున్నట్టు డీవోటీ గుర్తించింది. వీటిని డీవోటీ బ్లాక్ చేసింది. మరో 30,700 ఎస్ఎంఎస్‌లు, 1,95,766 టెంప్లెట్స్ డిస్‌కనెక్ట్ చేసింది. ఈ నేరాలకు సంబంధించి 500 మందిని అరెస్టు చేసింది. మరో 3.08 లక్షల ఎస్ఎంఎస్‌లు బ్లాక్ చేసింది. 50 వేల ఐఎంఈఐ నెంబర్లను సైతం నిషేధించింది. అంతేకాకుండా 592 ఫేక్ లింక్స్, 2,194 యూఆర్ఎల్‌లు బ్లాక్ అయ్యాయి.
ట్రాయ్ నిబంధనల ప్రకారం బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు తమ ప్రొమోషనల్ కార్యకలాపాలకోసం పది అంకెల మొబైల్ నెంబర్లు వినియోగించాల్సి ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా మోసాలు జరుగుతుంటే గుర్తించేందుకు 1.40 లక్షల మొబైల్ నెంబర్లను బ్లాక్ చేసింది.
Also read: PF Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్, ఈసారి తగ్గనున్న వడ్డీ ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook