PF Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్, ఈసారి తగ్గనున్న వడ్డీ ఎప్పుడంటే

PF Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్. ఈసారి పీఎఫ్‌పై చెల్లించే వడ్డీ రేటు తగ్గనుంది. సీబీటీ ఇవాళ పీఎఫ్ వడ్డీపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈసారి వడ్డీ  విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 10, 2024, 11:03 AM IST
PF Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్, ఈసారి తగ్గనున్న వడ్డీ ఎప్పుడంటే

PF Interest Rate: ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వడ్డీ రేట్లు మార్చుతుంటుంది. ఇవాళ సీబీటీ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ది ఎంప్లాయిస్ పీఎఫ్ వడ్డీపై సమీక్షించనుంది. ఈసారి పీఎఫ్ వడ్డీ తగ్గించవచ్చని తెలుస్తోంది. 

దేశవ్యాప్తంగా 6 కోట్లకు పైగా పీఎఫ్ ఖాతాదారులున్నారు. మరి కొద్దిరోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఈసారి పీఎఫ్ వడ్డీ రేటు పెరుగుతందని ఆశించారు. ఇవాళ వడ్డీ రేట్లపై సీబీటీ సమీక్ష ఉంది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో పీఎఫ్ వడ్డీ రేటును 0.05 శాతం పెంచడం ద్వారా 8.10 శాతం ఉన్న వడ్డీ 8.15 శాతమైంది. కానీ ఇవాళ జరిగే సీబీటీ సమావేశంలో వడ్డీ రేటును అంటే 2024 ఆర్ధిక సంవత్సరానికి 8 శాతానికి తగ్గించవచ్చని తెలుస్తోంది. మరోవైపు ఈపీఎఫ్ఓ పెట్డుబడుల వాటాను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచుకునేందుకు సీబీటీ అనుమతి తీసుకోనుంది. ఇవాళ జరిగే సీబీటీ సమావేశంలో పెన్షన్, బడ్జెట్ అంచనాలు, ఎదురయ్యే సవాళ్లపై చర్చించనున్నారు. హై పెన్షన్, ఈపీఎఫ్ఓలో ఖాళీల భర్తీ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. 

పీఎఫ్ ఖాతాదారులకు వడ్డీ రేటు 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 0.05 శాతం పెచి 8.10 శాతం నుంచి 8.15 శాతంగా వడ్డీ మార్పు చేశారు. పీఎఫ్ అనేది ఆ ఏడాది మొత్తం జమ అయ్యే నగదుపై ఆదారపడి ఉంటుంది. ఆ నగదుపైనే వడ్డీ లెక్కిస్తారు. ఈసారి పీఎఫ్ వడ్డీ రేటును బహిరంగంగా ప్రకటిస్తారా లేక ఆర్ధిక మంత్రిత్వ శాఖ అనుమతి తరువాత వెల్లడిస్తారా అనేది ఇంకా తెలియలేదు. 2023-24 సంవత్సరానికి సంబంధించి జూలై నెలలో పీఎఫ్ వడ్డీ రేటును ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఆమోదం లేకుండానే ప్రకటించాల్సిందిగా కార్మిక శాఖ కోరింది. 

ఏది ఎలాగున్నా ఈసారి పీఎఫ్ ఖాతాలపై వడ్డీ రేటు మాత్రం 8.15 శాతం నుంచి 8 శాతానికి తగ్గవచ్చని తెలుస్తోంది.      

Also read: DA Hike News: 50 శాతానికి చేరనున్న డీఏ, ఎప్పట్నించి అమల్లోకి రానుందంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News