కాంగ్రెస్‌లో బలపడుతున్న ప్రియాంక నినాదం !!

కాంగ్రెస్ చీఫ్ గా ప్రియాంక బెటర్ ఛాయిస్ ..బెస్ట్ ఆప్షన్....సీనియర్ల నోట ఇదే మాట !!  

Last Updated : Jul 29, 2019, 07:06 PM IST
కాంగ్రెస్‌లో బలపడుతున్న ప్రియాంక నినాదం !!

ఇప్పుడున్న కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని గట్టేక్కించే సామర్థ్యం ప్రియాంక గాంధీకి  ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలె సీనియర్ నేత శత్రుఘ్నసిన్హా... ప్రియాంకలో ఇందిరా తరహా నాయకత్వ సమర్థత ఉందని ..అధ్యక్ష పదవికి ప్రియాంక అర్హురాలని ప్రకటించిన విషయం తెలిసిందే.  హర్యానా సీఎం కూడా యువతరమే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడితే బాగుంటుందని.. ప్రియాంక నాయకత్వానికి పరోక్ష మద్దతు తెలుపుతూ సంకేతాలు ఇచ్చారు.  ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ప్రియాంక నాయకత్వానికి మద్దతు పలికారు.

ప్రియాంక మెస్ట్ ఎలిజిబుల్ 
కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ మాట్లాడుతూ ఇందిరా తరహా ప్రియాంకలో సహజసిద్ధంగా జనాలను ఆకర్షించే చరిష్మా ఉందన్నారు. సమస్యలపట్ల వేగంగా స్పందించే నాయకత్వ సమర్థత ఆమెకు ఉందన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ఆమె అర్హరాలని..ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని వ్యాఖ్యనించారు. ప్రస్తుత అనిశ్చితి నుంచి పార్టీ గట్టేక్కాలంటే ఆమె నాయకత్వాన్ని బలపరాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

మెట్టుదిగని రాహుల్ గాంధీ
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘరో వైఫల్యం చవిచూసిన విషయం తెలిసిందే. అధికారం కైవసం చేసుకోవడం అటుంచితే కేవలం 52 స్థానాలకే పరిమితమైంది. పార్టీ అధ్యక్షుడి హోదాలో బరిలోకి దిగిన రాహుల్ సొంత ఇలాఖా అమేథిలో ఓటమి ఆ పార్టీని మరింత కుంగదీసింది. ఎలాగో అలా కేరళలోని వయానడ్ స్థానం నుంచి బరిలోకి దిగడంతో లోక్ సభలో రాహుల్ గాంధీ అడుగుపెట్టగలిగారు. లేదంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఈ పరిణామాలకు కలత చెందిన రాహుల్ గాంధీ ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు నుంచి దూరం జరిగారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోనని ప్రకటించారు. సీనియర్లు బుజ్జగించినా రాహుల్ మెట్టు దిగడం లేదు. దీంతో పార్టీ కి ప్రత్నామ్నాయ నేతను ఎన్నుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రియాంక బెటర్ ఛాయిస్.బెస్ట్ ఆప్ఘన్ 
ఇలాంటి సందర్భంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సీనియర్ నేతలు ఎవరూ ధైర్యం చేయకపోవడం..ఎవరూ ముందుకు రాకపోవడం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో అందరికీ ప్రియాంక ఒక ఛాయిస్ లా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో గత కొంత కాలం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతల నోట ప్రియాంక మాట వినిపిస్తోంది. మరి సీనియర్ల మాటకు విలువ  ఇచ్చి ప్రియాంక పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు వస్తారా లేదా దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
 

 

Trending News