కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై డీఎంకే చీఫ్ స్టాలిన్ రియాక్షన్ ఇదే

 మూడో కూటమి ఏర్పాటుపై డీఎంకే చీఫ్ స్టాలిన్ తన అభిప్రాయన్ని వ్యక్తం చేశారు

Updated: May 14, 2019, 12:47 PM IST
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై డీఎంకే చీఫ్ స్టాలిన్ రియాక్షన్ ఇదే

సీఎం కేసీఆర్ ఫెడలర్ ఫ్రంట్ పై డీఎంకే అధినేత స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మూడో కూటమి ఏర్పడేందుకు అవకాశం లేదని స్టాలిన్‌ అభిప్రాయపడ్డారు. భాజపా, కాంగ్రెస్‌ లేకుండా మూడో కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఛాన్స్ లేదన్నారు. 

కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేది  మే 23 తర్వాతే దీనిపై ఓ స్పష్టత వస్తుందన్నారు.  యూపీఏ కూటమికి తమ మద్దతు కొనసాగుతుందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన మరుసటి రోజే స్టాలిన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుంది.