టిప్పుసుల్తాన్ హిందూ వ్యతిరేకా.?

    

Last Updated : Oct 21, 2017, 04:30 PM IST
టిప్పుసుల్తాన్ హిందూ వ్యతిరేకా.?

బీజేపీ నేత మరియు కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే ఓ సంచలనాత్మక ప్రకటన చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సెక్రటరీకి ఉత్తరం రాస్తూ, రాష్ట్రం నవంబరు 10వ తేదీన జరపబోయే టిప్పుసుల్తాన్ జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికలో తన పేరు ప్రస్తావించవద్దని తెలిపారు.

ఆ ఉత్తరంపై స్పందిస్తూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడారు "ఒక ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉంటూ ఇలాంటి లేఖ రాయకుండా ఉండాల్సింది. ఒక సాధారణ పద్ధతి ప్రకారం మా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో పాల్గొనమని అందరూ కేంద్ర, రాష్ట్రమంత్రులకు మేము మా బాధ్యతగా ఆహ్వానాలు పంపించాల్సిందే. వారు  ఉత్సవానికి వస్తారా? లేదా అన్నది వాళ్లిష్టం" అన్నారు. 

టిప్పుసుల్తాన్ జయంతి ఉత్సవాలను నిర్వహించాలా.. వద్దా అన్న విషయంపై ఇంతకు క్రితమే కర్ణాటక ప్రభుత్వం అనేక తర్జనభర్జనలు పడింది. ఆఖరికి ఆ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించే అధికార ఉత్సవంగా ప్రకటించారు. ఈ సంవత్సరం కూడా ఈ ఉత్సవాలను రవీంద్ర కళాక్షేత్రంలో నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వం టిప్పుసుల్తాన్‌ను జాతివీరుడిగా పరిగణిస్తూ, బ్రిటీష్ నేతలపై పోరాడిన యోధుడిగా పరిగణిస్తుంది. అయితే బీజేపీ మరియు ఆర్‌ఎస్‌ఎస్‌కు ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

కొందరు ఆర్‌ఎస్‌ఎస్ అనుయాయులు టిప్పుసుల్తాన్‌ను ఒక క్రూరుడైన రాజుగా, హిందు వ్యతిరేకిగా భావిస్తున్నారు. బీజేపీ ఎంపీ శోభా కరందలజే ఈ విషయంపై బహిరంగంగా స్పందించారు. టిప్పు సుల్తాన్ ఒక హిందు వ్యతిరేకి. కన్నడిగులకు కూడా ఆయనపై సదభిప్రాయం లేదు. వారు కూడా ఈ జయంతి ఉత్సవాలను వ్యతిరేకిస్తున్నారు అని ఆమె తెలిపారు. 

 

 

 

 

 

Trending News