Exit Polls 2024: ఏ పార్టీ లేదా కూటమి పదేళ్లు అధికారంలో ఉంటే.. ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడటం ఎపుడు చూస్తున్నదే. కానీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ పదేళ్లు పూర్తి చేసుకున్నా.. ఆ పార్టీపై ప్రజా వ్యతిరేకత లేకుండా మరోసారి అధికారంలోకి రాబోతుందని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ చెబుతున్నట్టు 370 సీట్లు.. కూటమికి 400 ఎంపీ సీట్లు రాకపోయినా.. మంచి లోక్ సభలో హాఫ్ మార్క్ దాటడం పక్కా అని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. టుడేస్ చాణక్య , జన్ కీ బాత్, ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సర్వేలు మాత్రం బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే కూటమి 400 ఎంపీ సీట్ల వరకు గెలుస్తుందని చెబుతున్నాయి. మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టడం లాంఛనమే అని చెబుతున్నాయి.
మరోవైపు గతంలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక సీట్లు వచ్చిన రాజస్థాన్, బిహార్, హర్యాణల్లో మాత్రం సీట్లు తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నాయి. రాజస్థాన్ లో బీజేపీకి 5 సీట్ల వరకు కోత పడే అవకాశం ఉందని చెబుతున్నాయి. మరోవైపు హర్యాణలో 4 నుంచి 5
సీట్లు ఇండి కూటమి గెలిచే అవకాశాలున్నాయని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. అటు బిహార్ లో ఎన్డీయే కూటమి 40 సీట్లకు గాను 39 సీట్లు గెలుచుకుంది. ఈ సారి ఎన్నికల్లో అక్కడ 30 నుంచి 33 సీట్లకే పరిమితమవుతోందని సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు అక్కడ ఇండి కూటమి 5 నుంచి 7 సీట్ల వరకు గెలిచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో కూడా గతంలో కంటే ఎన్టీయే కూటమికి సీట్లు తగ్గే అవకాశాలున్నాయి. కూటమిలోని పార్టీలకు సీట్లు తగ్గినా.. బీజేపీ సీట్లు మాత్రం పెరుగుతాయని చెబుతున్నాయి.
అటు పశ్చిమ బెంగాల్, ఒడిషా, తెలంగాణలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించే అవకాశాలున్నాయని చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ దాదాపు 25 నుంచి 29 సీట్ల వరకు గెలిచే అవకాశాలున్నాయని సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఇక ఒడిషా రాష్ట్రంలో 21 సీట్లకు గాను 16 సీట్ల వరకు గెలిచే అవకాశాలున్నాయని.. తెలంగాణలో 7 నుంచి 9 సీట్ల వరకు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్కువ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడించాయి.ఈ సారి కూడా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బీజేపీకి కంచుకోటగా నిలిచే అవకాశాలున్నాయి. రాజస్థాన్, హర్యాణ, బిహార్లలో తగ్గే సీట్లను దక్షిణాదిలో తమిళనాడు, కేరళ, తెలంగాణలో గెలిచే సీట్లతో భర్తీ అయ్యే అవకాశాలున్నాయని సర్వే సంస్థలు వెల్లడించాయి. మొత్తంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చరిత్ర తిరగరాస్తుందా లేదా అనేది చూడాలంటే మరో రెండు రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read: Telangana Lok Sabha: తెలంగాణలో అనూహ్య ఫలితాలు.. కాంగ్రెస్‌కు బీజేపీ షాక్.. కారు షెడ్డుకే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook