న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపి అభ్యర్థిగా బరిలోకి దిగిన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ రెండు ఓటర్ ఐడి కార్డులు కలిగి వున్నారని ఆయనపై ప్రత్యర్థిగా పోటీచేస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిషి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆమె ఎన్నికల అధికారికి సైతం ఫిర్యాదు చేశారు. అయితే, అతిషి చేసిన ఆరోపణలపై తాజాగా స్పందించిన గౌతం గంభీర్.. తన వద్ద రెండు ఓటర్ ఐడి కార్డులు లేవని, తనకు ఒకే ఒక్క ఓటర్ ఐడెంటిటీ ఉందని స్పష్టంచేశారు.
రాజేందర్ నగర్లో వున్న ఓటు హక్కు తప్ప మరెక్కడ తనకు ఓటు హక్కు లేదని వివరణ ఇచ్చి తనపై వస్తోన్న ఆరోపణలకు గౌతం గంభీర్ ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.