Free Gas Cylinder: గుడ్ న్యూస్.. ఆ రాష్ట్రంలో దీపావళికి గ్యాస్ సిలిండర్ ఫ్రీ..

yogi aditynath: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. దీపావళి కానుకగా గ్యాస్‌ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2023, 10:06 PM IST
Free Gas Cylinder: గుడ్ న్యూస్.. ఆ రాష్ట్రంలో దీపావళికి గ్యాస్ సిలిండర్ ఫ్రీ..

UP Free LPG Cylinders: యూపీ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi adityanath) గుడ్ న్యూస్ చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్లో ఉజ్వల యోజన’ (Ujjwala Yojana) పథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నవారందరికీ దీపావళి కానుకగా ఒక గ్యాస్‌ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. మంగళవారం ఆయన బులంద్‌శహర్‌లో రూ.632 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదిత్యనాథ్‌ ఫ్రీ గ్యాస్ కు సంబంధించి ప్రకటన చేశారు. 

ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఏడాదికి రెండుసార్లు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మ్యానిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీపావళి, హోలీ పండుగల నాడు ఈ గ్యాస్ సిలిండర్ అందజేయడం వల్ల లబ్దిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిస్తుంది. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.3300 కోట్లు కేటాయించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత యోగి ప్రభుత్వం తన హామీని నెరవేర్చబోతుంది. ఉజ్వల పథకం కింద రాష్ట్రంలో 1.75 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. 

ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు పొందిన వారిందరికీ సిలిండర్‌ ధరను రూ.300 మేర తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి గ్యాస్ సిలిండర్ ను ఉచితంగా సరఫరా చేస్తుంది. 

Also Read: Bombay High Court: పొట్టి డ్రెస్సులు వేసుకుంటే అశ్లీలత కానేకాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News