హార్ధిక్ పటేల్ సెక్స్ వీడియో..సోషల్ మీడియాలో వైరల్ !

పటేల్ రిజర్వేషన్ ఉద్యమ నేత హార్ధిక పటేల్ కు సంబంధించిన ఓ సెక్సె వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మరింది. . 

Last Updated : Nov 14, 2017, 02:05 PM IST
హార్ధిక్ పటేల్ సెక్స్ వీడియో..సోషల్ మీడియాలో వైరల్ !

అహ్మదాబాద్: పటేల్ రిజర్వేషన్ ఉద్యమ నేత హార్ధిక పటేల్ కు సంబంధించిన ఓ సెక్సె వీడియో సోషల్ మీడియాలో హచ్ చల్ చేస్తోంది. వైరల్ గా మారిన ఈ వీడియో.. మే 16వ తేదీ చిత్రీకరించినట్లు చూపిస్తోంది.  ఈ వీడియోలో హార్ధిక్ పటేల్లా ఉన్న వ్యక్తి ఓ మహిళతో సన్నిహితంగా గడిపినట్లు సృష్టంగా కనిపిస్తోంది. గుజరాత్‌‌లో పటేళ్ల రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ఆయన..బీజేపీ సర్కార్ పై తీవ్ర స్థాయి విరుచుకుపడుతున్నాడు.. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్‌‌కు దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన రాసలీలలకు సంబంధించిన సీడి బయటపడటంతో రాజకీయంగా దుమారం రేగుతోంది. ఎన్నికలు దగ్గర పడిన నేపథ్యంలో బీజేపీ దీన్ని రాజకీయంగా వాడుకోవాలని భావిస్తోంది. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై హార్ధిక పటేల్ స్పందిస్తూ బీజేపీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమని ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల్లో లబ్ది కోసమే మార్ఫింగ్ చేసిన ఈ సీడీని బీజేపీ తెరపైకి తెచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ సీడీని దేశం బయటే మార్ఫింగ్ చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. గుజరాత్ మహిళల ప్రతిష్ఠను దిగజార్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఇదో భాగమని హార్టిక్ పటేల్ విమర్శించారు.

 

 

మరోవైపు దీనిపై బీజేపీ నేతలు స్పందిస్తూ ఈ సీడీ బయటికి రావడంతో హార్ధిక్ పటేల్ నిజస్వరూపం బయటప్రపంచానికి తెలిసిందని ఆరోపించారు. హార్ధిక్ పటేల్ అడ్డంగా దొరికిపోయాడని.. హార్థిక్ పటేల్ కట్టు కథలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ..బీజేపీ కౌంటర్  ఇచ్చింది.

Trending News