Oldest Case: దేశంలో అతి ప్రాచీన కేసుకు 72 ఏళ్ల తరువాత మోక్షం, కలకత్తా హైకోర్టు వేదిక

Justice delayed is justice denied.భారత న్యాయవ్యవస్థలో ఇదే జరిగింది. న్యాయం ఆలస్యం కావడమే కాదు..ఎన్ని జీవితకాలాలు ఆలస్యమైందో చెప్పలేని పరిస్థితి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 16, 2023, 06:54 PM IST
Oldest Case: దేశంలో అతి ప్రాచీన కేసుకు 72 ఏళ్ల తరువాత మోక్షం, కలకత్తా హైకోర్టు వేదిక

దేశ న్యాయవ్యవస్థ చరిత్రలో అతి పాత కేసు పరిష్కారమైంది. ఏకంగా 72 ఏళ్ల తరువాత ఆ కేసుకు మోక్షం కలిగింది. 1951లో దాఖలైన బర్హంపూర్ బ్యాంక్ కేసును కోల్‌కతా హైకోర్టు గత వారం పరిష్కరించింది. 

పశ్చిమ బెంగాల్ కలకత్తా హైకోర్టు నుంచి బర్హంపూర్ బ్యాంక్ కేసు లిక్విడేషన్ ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన వ్యాజ్యం ఎట్టకేలకు బయటపడేనాటికి దేశంలోని అత్యంత పాతవైన ఐదు కేసుల్లో రెండు కేసులు విచారణలో ఉన్నాయి. ఈ కేసులు 1952లో దాఖలయ్యాయి. అంటే 72 కేసుకు ఏడాది తరువాత దాఖలైన కేసులు. 

మిగిలిన మూడు కేసుల్లో రెండు కేసులు సివిల్ వ్యాజ్యాలు. మరొకటి మద్రాస్ హైకోర్టులో పెండింగులో ఉంది. సివిల్ కేసులు రెండూ పశ్చిమ బెంగాల్ మాల్దాకు చెందినవి. గత ఏడాది మార్చ్, నవంబర్ నెలల్లో మాల్దా కోర్టు వరుస విచారణలు చేపట్టింది. 

బర్హంపూర్ బ్యాంక్ కేసు నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ప్రకారం గతవారం అంటే జనవరి 8 వరకూ అత్యంత పాత కేసుగా నమోదై ఉంది. దేశంలో ఏ న్యాయస్థానంలోనూ ఇంత పాత కేసు లేదు. 

బర్హంపూర్ బ్యాంకు దివాళాకు సంబంధించిన ఈ కేసు నవంబర్ 19, 1948నాటిది. లిక్విడేషన్ ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ జనవరి 1,1951 పిటీషన్ దాఖలు కాగా అదే రోజు కేస్ నెంబర్ 71/1951 గా ఫైల్ అయింది. బకాయిదారుల్నించి అప్పులు వసూలు చేయలేక బర్హంపూర్ బ్యాంక్ అనేక ఇబ్బందుల్లో చిక్కుకుంది. బ్యాంకు లిక్విడేషన్‌కు సంబంధించిన పిటీషన్ హైకోర్టులో గత ఏడాది సెప్టెంబర్‌లో విచారణకొచ్చింది. జస్టిస్ రవి కృష్ణన్ కపూర్ కోర్టు లిక్విడేటర్ నుంచి నివేదిక కోరారు. 2006 ఆగస్టులో ఈ కేసు డిస్పోజ్ అయినట్టుగా అసిస్టెంట్ లిక్విడేటర్ కోర్టుకు విన్నవించాడు. అయితే రికార్డుల్లో అప్‌డేట్ కాకపోవడంతో పెండింగు జాబితాలో ఉండిపోయిందని వెల్లడించాడు.

కలకత్తా హైకోర్టులో ఇంకా పెండింగులో ఉన్న రెండు పాత కేసుల్లో జస్టిస్ కపూర్ 2022 ఆగస్టు 23 వ తేదీన చివరిసారిగా విచారణ జరిపారు. సుదీర్ఘమైన వ్యాజ్యానికి ముగింపు ఇచ్చేందుకు అన్ని పక్షాల్ని కలిసి ఏం చేయాలో సూచించాలని ఓ న్యాయవాదిని, ప్రత్యేక అధికారిని ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించి చాలా తక్కువ సమాచారముంది డేటాలో.

Also read: MLAs With Oxygen Cylinders: ఆక్సీజన్ సిలిండర్లు తగిలించుకుని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News