Plane Hits: తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. ఎయిర్‌పోర్ట్‌లో ఢీకొన్న విమానాలు

IndiGo Plane Hits Air India Express Aircraft: విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్టులో బయల్దేరుతున్న ఓ విమానాన్ని మరో విమానం ఢీకొట్టడంతో కలకలం రేపింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 27, 2024, 06:33 PM IST
Plane Hits: తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. ఎయిర్‌పోర్ట్‌లో ఢీకొన్న విమానాలు

Plane Hits: ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీకొట్టాయి. ప్రయాణికులతో ఉన్న విమానాన్ని మరో విమానం ఢీకొట్టడంతో ఓ విమానం రెక్క భాగం విరిగిపోయింది. తృటిలో జరిగిన ఈ ఘోర ప్రమాదంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. బయట ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు బెంబేలెత్తారు. ఈ సంఘటనపై పౌర విమానయాన శాఖ విచారణకు ఆదేశించింది. ఇద్దరు పైలెట్లపై వేటు వేశారు. ఈ సంఘటన కోల్‌కత్తాలోని విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

Also Read: Lok Sabha Elections: ప్రధాని మోదీని ఇంటికి పంపించే దాకా నిద్రపోం: సీఎం కొడుకు తీవ్ర వ్యాఖ్యలు

 

కోల్‌కత్తా నుంచి చెన్నైకి ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎయిర్‌ ఇండియా విమానం బయల్దేరింది. అదే సమయంలో దర్బాంగ వెళ్తున్న విమానాన్ని ఎయిర్‌ ఇండియా విమానం ఢీకొట్టింది. ఇండిగో విమానాన్ని ఢీకొట్టడంతో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం రెక్క చివరి భాగం విరిగిపడిపోయింది. దర్బంగా వెళ్లే విమానం రెక్కకు సొట్ట పడింది. ఈ ప్రమాదంతో విమానంలోని ప్రయాణికులు ఆందోళన చెందారు. ఇండిగో విమానంలో నలుగురు చిన్నారులతో సహా 135 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: Modi Chant: మోదీ భజన చేస్తే చెంప పగలగొట్టాలి.. మంత్రి వ్యాఖ్యలు తీవ్ర దుమారం

 

ఈ సంఘటనపై పౌర విమానయాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ స్పందించారు. విమానాలు నడిపిన పైలెట్లను విధుల నుంచి తొలగించాలని ఆయా విమాన సంస్థలకు ఆదేశించింది. ఈ సంఘటనపై ఆయా సంస్థలు వివరణ ఇవ్వాలని కోరింది. ఈ ప్రమాదం కారణంగా దర్బంగా విమానం ఆలస్యంగా బయల్దేరింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News