ఇండిగో మెగాసేల్‌: చౌకగా విమాన టికెట్లు

జులై 25, 2018 నుంచి మార్చి 30, 2019వరకు చేసే ప్రయాణాలకు జులై 10 నుంచి జులై 13వ తేదీ వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.

Last Updated : Jul 10, 2018, 03:32 PM IST
ఇండిగో మెగాసేల్‌: చౌకగా విమాన టికెట్లు

తక్కువ ధరలకు విమాన సర్వీసులు అందించే ఎయిర్‌లైన్స్‌ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న ఇండిగో.. తన 12వ వార్షికోత్సవం సందర్భంగా 12లక్షల సీట్లను కారుచౌకగా ప్రయాణికులకు అందించేందుకు నాలుగు రోజుల మెగాసేల్‌ను ప్రారంభించనుంది. ప్రారంభ టికెట్ ధర రూ.1,212గా నిర్ణయించింది. జులై 25, 2018 నుంచి మార్చి 30, 2019వరకు చేసే ప్రయాణాలకు జులై 10 నుంచి జులై 13వ తేదీ వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. దేశీయ మార్కెట్ వాటాలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌ సంస్థ అయిన ఇండిగో ప్రస్తుతం 1,086 రోజువారీ విమానాలను నడుపుతోంది. 42 దేశీయ, 8 అంతర్జాతీయ సేవలను అందిస్తోంది.

సంస్థ అధికార ప్రతినిధి విలియమ్‌ బౌల్టర్‌ మాట్లాడుతూ ‘ఈ మెగాసేల్‌ను ప్రకటిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఆగస్టు 4, 2018 నాటికి ఇండిగో ఎయిర్‌లైన్స్ స్ధాపించి 12 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఆఫర్‌ను ప్రకటించాం. దాదాపు 57 ప్రధాన నగరాలను (దేశీయంగా, అంతర్జాతీయంగా) కలుపుతూ మొత్తం 12 లక్షల సీట్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచాం’ అని తెలిపారు. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో కనీసం రూ.3000తో టికెట్ బుకింగ్‌ చేసుకున్నవారు రూ.500 వరకు క్యాష్‌బాక్‌ కూడా పొందవచ్చని కూడా సంస్థ ప్రకటించింది.

Trending News