తమిళనాడులో స్టార్ వార్ నడుస్తోంది. కమల్ పొలిటికల్ ఎంట్రీ పై ఇటీవలే రజనీకాంత్ స్పందిస్తూ డబ్బు, హోదాతో రాజకీయాల్లో గెలవలేం. అంతకంటే ఎక్కువే ఉండాలి. దీని గురించి కమల్‌హాసన్‌కి బాగా తెలుసు.’ పేర్కొన్నారు. రజనీ వ్యాఖ్యలపై స్పందించిన కమల్ హాసన్..రాజకీయాల్లో గెలవడం ఒక్కటే ముఖ్యం కాదని ..ప్రజల నమ్మకాన్ని పోగొట్టకుండా వారికి మంచి చేయడం కూడా గెలుపేనని సుతిమొత్తని కౌంటర్ ఇచ్చారు. నవంబర్ లో కమల్ హాసన్ కొత్త పార్టీ పెటుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో రజనీకాంత్ కూడా రాజకీయాల్లో వస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తాజా పరిణామాలను చూస్తుంటే.. ఈ ఇద్దరు స్టార్ల మధ్య కోల్డ్ వార్ మొదలైనట్లు కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ కోల్డ్ వార్ మరింత ముదిరే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.