కరుణానిధికి తెలుగు సినీ పరిశ్రమతో విడదీయరాని అనుబంధం

                                                      

Last Updated : Aug 8, 2018, 07:03 PM IST
కరుణానిధికి తెలుగు సినీ పరిశ్రమతో విడదీయరాని అనుబంధం

తెలుగు జాతి మూలాలున్న దివంగత నేత కరుణనిధికి తెలుగు చిత్ర పరిశ్రమతోనూ విడదీయరాని అనుబంధం ఉంది. తెలుగు సినీ పరిశ్రమ  హైద్రాబాద్ కు సిఫ్ట్ కాకముందు... మద్రాసు కేంద్రంగా నడిచిన విషయం తెలిసిందే. అప్పట్లోనే మన తెలుగు సినీ పరిశ్రమ మంచి గుర్తింపు సాధించింది. తమిళనాడులో ఉన్నప్పుడే మన తెలుగు సినీ పరిశ్రమ నిలదొక్కుకుంది. మన చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో కరుణ కీలక పాత్ర పోషించారు. పక్క రాష్ట్రమనే బేదంతో చూడకుండా తెలుగు సినీ పరిశ్రమను ఎంతగానో ప్రోత్సహించారు. కరుణ అందించిన ప్రోత్సహంతోనే ఈ రోజు మన తెలుగు సినీ పరిశ్రమ ఈ స్థాయిలో నిలించిందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. తమిళంతో సమానం తెలుగు భాషను  గౌరవించే వారని కరుణనిధికి పేరుంది. 
 
తెలుగు సినిమాకు కరుణనిధి స్ర్కీన్‌ప్లే 
రాజకీయాల్లో ఆయన ఎంత బీజీగా ఉన్న తెలుగు సినిమా పంక్షన్ కు పిలిస్తే కరుణానిధి తప్పకుండా హాజరయ్యవారట. హీరో కృష్ణ నటించిన ‘అమ్మాయి మొగుడు-మామకు యముడు’ 1980లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి కరుణానిధి స్ర్కీన్‌ప్లే అందించారు కూడా. కరుణానిది మేనల్లుడు ‘మురసోలి’ సెల్వం ఈ చిత్రానికి నిర్మాత కావడం గమనార్హం. ఇలా తెలుగు పరిశ్రమతో విడదీయరాని అనుంబంధమున్న కరుణనిధి కానరాని లోకాలకు వెళ్లిపోవడం.. తీరని లోటుగా తెలుగు చిత్ర పరిశ్రమ భావిస్తోంది.

Trending News