SBI Recruitmet 2022: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుల స్వీకరణకు నేడే (జూన్ 12) తుది గడువు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీలు, అప్లికేషన్ విధానం తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఖాళీల వివరాలు :
ఏజీఎం (ఐటీ -టెక్ ఆపరేషన్స్)-2
ఏజీఎం (ఐటీ - ఔట్ బౌండ్ ఇంజనీర్) 2
ఏజీఎం (ఐటీ-ఇన్‌బౌండ్ ఇంజనీర్) 2
ఏజీఎం (ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్) 2
మేనేజర్ (ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్) 3
డిప్యూటీ మేనేజర్ (నెట్‌వర్క్ ఇంజనీర్) 11
డిప్యూటీ మేనేజర్ (సైట్ ఇంజనీర్ కమాండ్ సెంటర్) 11
డిప్యూటీ మేనేజర్ (స్టాటిస్టిషియన్) 7
అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే.. ఇందులో ఒక్కో పోస్టు వికలాంగ అభ్యర్థుల కోసం రిజర్వ్ చేయబడింది.
విద్యార్హత, వయోపరిమితి :
ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ/బీటెక్/బీఈ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, టెక్నికల్ నాలెడ్జ్ తప్పనిసరి. అభ్యర్థుల వయసు 35-45 మధ్య ఉండాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి :
అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థుల ఎంపిక విధానం :
పని అనుభవం ఆధారంగా అభ్యర్థుల షార్ట్ లిస్ట్ రూపొందిస్తారు. కాల్ లెటర్ ద్వారా మెయిల్ ద్వారా ఆ అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. లేదా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో షార్ట్ లిస్ట్ జాబితా ఉంచుతారు. ఇంటర్వ్యూ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
Also Read:Fourth Wave Alert: దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు, తగ్గిన మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.