Man approches Bombay HC for 1000 cr compensation: కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసుకోవడం వలనే తన కూతురు చనిపోయిందంటూ ఆరోపిస్తూ మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వైద్య విద్యార్థిని అయిన తన కూతురు గతేడాది వ్యాక్సిన్ తీసుకుని.. సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిదని పిటిషన్ పేర్కొన్నాడు. అంతేకాదు అతడు భారీ పరిహారాన్ని కోరాడు. మహారాష్ట్ర ప్రభుత్వం, సదరు వ్యాక్సిన్ సంస్థ రూ.1000 కోట్లు పరిహారం చెల్లించేలా ఆదేశించాలని సదరు వ్యక్తి ఆ పిటిషన్లో కోరాడు.
'నా కుమార్తె పేరు స్నేహాల్. నాసిక్‌లో వైద్య విద్యను అభ్యసిస్తోంది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఆరోగ్య కార్యకర్తలంతా టీకా తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దాంతో నా కూతురు గతేడాది జనవరిలో కొవిషీల్డ్ టీకా వేసుకుంది. కరోనా టీకా సురక్షితమని, ఎలాంటి హానీ ఉండదని చెప్పారు. అది నమ్మి వైద్య కళాశాలలో నా కూతురు వ్యాక్సిన్ తీసుకుంది' అని లునావత్ పిటిషన్ పేర్కొన్నారు.
టీకా తీసుకున్న నా కూతురు ఆరోగ్య కార్యకర్తగా కూడా సేవలందించింది. టీకా సురక్షితమని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ), ఎయిమ్స్ డైరెక్టర్, మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం తప్పుడు ప్రచారం చేయడం వల్లే నా కూతురు లాంటి ఎందరో కార్యకర్తలు వ్యాక్సిన్ తీసుకున్నారు' అని లునావత్ పిటిషన్లో తెలిపారు.
తన కూతురు 2021 జనవరి 28న టీకా తీసుకుందని, ఆ తర్వాత దుష్ప్రభావాల కారణంగా మార్చి 1న మరణించిందని లునావత్ పిటిషన్‌లో పేర్కొన్నాడు. కొవిషీల్డ్ టీకా దుష్ప్రభావాల కారణంగానే నా కుమార్తె మృతి చెందిందని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏఈఎఫ్‌ఐ కమిటీ గతేడాది అక్టోబర్ 2న వెల్లడించినట్లు తెలిపారు. తన కుమార్తెకు సరైన న్యాయం కావాలని, రూ.1000 కోట్లు పరిహారం చెల్లించాలని సదరు వ్యక్తి బాంబే హైకోర్టు పిటిషన్‌లో వివరించారు. ఈ కేసును గతవారమే దాఖలు చేయగా.. హైకోర్టు విచారణకు ఇంకా రాలేదు.
Also Read: Burning Lorry Kerala: అగ్నిప్రమాదానికి గురైన గడ్డివాము లారీ.. ప్రాణాలకు తెగించి కాపాడిన యువకుడు!
Also Read: Varun Tej Lavanya Tripathi Marriage: వరుణ్‌తో పెళ్లి.. లావణ్య త్రిపాఠి ఏమన్నారంటే?!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook