శృతి మించిన మూఢనమ్మకం ; దోష నివారణ పేరుతో నాలుగేళ్లుగా అత్యాచారం

Last Updated : Oct 2, 2018, 07:30 PM IST
శృతి మించిన మూఢనమ్మకం ; దోష నివారణ పేరుతో నాలుగేళ్లుగా అత్యాచారం

తల్లి తర్వాత స్థానం మేనమామదే అంటారు.  కానీ ఇక్కడ సీన్ రివర్స్.. మనిషి రూపంలో ఉన్న ఓ కామ పిశాచి తన సొంత మేనకోడలిపై నాలుగేళ్లుగా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనతో దేశ రాజధానిలో సంచలనం సృష్టిస్తోంది.
 

పోలీసుల వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన ఓ కామ పిచాచి జాతకాన్ని ఎరగా చూపి సొంత మేనకోడలు (23)ను లొంగదీసుకున్నాడు. నాలుగేళ్లుగా అదేపనిగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు . అయితే ఇటీవలే ఆమెకు పెళ్లయింది... అయినప్పటికీ తన కోరికను తీర్చాలంటూ ఆమెను వేధించసాగాడు. మేనమామ చేష్ఠాలతో విసుగెత్తిపోయిన బాధితులు..ఇక గత్యంతరం లేక ఈ విషయాన్ని ఆమె భర్త, మామలకు చెప్పింది.

ఈ దారుణ చర్య గురించి తెలుసుకున్న బాధితురాలి అత్తింటి వారు.. వెంటనే ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు.. ఆ కామాంధుడిని అరెస్ట్ చేసి కటాకటాల వెనక్కి నెట్టారు. ఘటనపై పోలీసులు నిందితుడిని విచారించగా...దోష నివారణ కోసమే తాను ఈ పని చేశానని ఒప్పుకోవడం గమనార్హం. 

బాధితురాలిని పోలీసులు విచారించగా..జాతకంలో దోషం ఉందని తనకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడని పేర్కొంది. తాను ఎన్నోసార్లు నిరాకరించానని..ఇలాగే ఉంటే పెళ్లి కాదని... తండ్రి కూడా చనిపోతాడని భయపెట్టి తనపై అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాని బాధితురాలు తన ఆవేదన వ్యక్తం చేసింది. 

మఢనమ్మకాలకు లోంగితే జివితాలు ఏ విధంగా నాశనమం అవుతాయనేదానికి తాజా ఘటన ఒక మంచి ఉదాహరణ.. కాబట్టి ఇలాంటి వాటికి స్వస్తి చెప్పి మన మీద మనకు నమ్మకం పెట్టుకొని బతుకుదాం..

Trending News