సభలో త్రిపుల్ తలాక్ బిల్లును సమర్ధించుకున్న బీజేపీ; ముస్లిం మహిళా హక్కుల కోసమేనన్న కేంద్ర మంత్రి

త్రిపుల్ తలాక్ విషయంలో ప్రతిపక్షాల లేవనెత్తిన అంశాలపై  కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరణ ఇచ్చారు

Last Updated : Dec 27, 2018, 08:03 PM IST
సభలో త్రిపుల్ తలాక్ బిల్లును సమర్ధించుకున్న బీజేపీ; ముస్లిం మహిళా హక్కుల కోసమేనన్న కేంద్ర మంత్రి

లోక్ సభలో త్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ వాడీ వేడీ జరిగింది. ప్రతిపక్షాల లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్రం మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రిపుల్ తలాక్ బిల్లు ముస్లిం మహిళలకు రక్షణగా ఉటుందని సమర్ధించుకున్నారు. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. త్రిపుల్ తలాక్ లో ఉన్న లోపాలను గుర్తించిన 20 ముస్లిం దేశాలు దీన్ని రద్దు చేశాయని ఈ సందర్భంగా గుర్తు  కేంద్ర మంత్రి చేశారు.

త్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో ప్రతిపక్షాలు అనవసర  రాద్దాంతం తప్పితే ..నిర్మాణాత్మకమైన సూచనలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ఇప్పటికీ తాము ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై అభ్యంతరాలు ఉంటే పరిశీలిస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. 

త్రిపుల్ తలాక్  బిల్లు ఏ కులానికీ, మతానికి, విశ్వాసానికి వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చారు. సమాజంలో మైనార్టీ మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే తామ ఈ బిల్లును రూపించాయమని కేంద్రం మంత్రి వివరణ ఇచ్చారు. ఇది పూర్తిగా మైనారిటీ మహిళల హక్కు, వారి న్యాయానికి సంబంధించినదని ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనాల లేవని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. కాబట్టి బిల్లుపై చర్చకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Trending News