JEE Mains Exams Update: జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఈసారి రెండు సార్లే

JEE Mains Exams Update: ఐఐటీ, ఎన్ఐటీ వంటి దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ విషయంలో కీలకమైన అప్‌డేట్ లభించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 19, 2022, 12:20 PM IST
  • జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహణపై ఎన్‌టీఏ కీలక నిర్ణయం
  • ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ పరీక్ష కేవలం రెండు సార్లే నిర్వహించాలని నిర్ణయం
  • గత యేడాది కరోనా కారణంగా నాలుగు సార్లు నిర్వహణ
JEE Mains Exams Update: జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఈసారి రెండు సార్లే

JEE Mains Exams Update: ఐఐటీ, ఎన్ఐటీ వంటి దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ విషయంలో కీలకమైన అప్‌డేట్ లభించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఇంజనీరింగ్‌కు సంబంధించి దేశంలో ప్రసిద్ధమైన జాతీయ విద్యాసంస్థలు రెండే రెండు. ఒకటి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాగా రెండవది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇందులో ప్రవేశం కోసం ప్రతియేటా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ రెండు పరీక్షలు జరుగుతుంటాయి. ఈ పరీక్షల్ని నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. ఇక నుంచి అంటే ఈ ఏడాది నుంచి జేఈఈ మెయిన్స్‌ను రెండుసార్లు మాత్రమే అంటే ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాలని నిర్ణయించింది. గత ఏడాది కరోనా నేపధ్యంలో నాలుగు సార్లు నిర్వహించారు. ఈసారి ఆ పరిస్థితి లేదు. 

గత ఏడాది అయితే జేఈఈ మెయిన్స్ నిర్వహణ అంతా అస్తవ్యస్థంగా జరిగింది. 2021లో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాలని నిర్ణయించగా..కోవిడ్ కారమంగా ఏప్రిల్, మేలో జరగాల్సిన పరీక్షలు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా 26 లక్షల మంది ఈ పరీక్షలు రాశారు. నాలుగు సార్లు నిర్వహించడం వల్ల కొద్దిమంది విద్యార్ధులు గణనీయంగా లబ్ది పొందారు. ఫలితంగా ఈ విధానంపై విమర్శలు చెలరేగాయి. కాంపిటిటివ్ స్పిరిట్ కు విరుద్ధమనే వాదన వచ్చింది. అందుకే ఈసారి ఆ అవకాశం ఇవ్వకూడదని ఎన్‌టీఏ నిర్ణయించింది. కరోనా కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు సకాలంలోనే అంటే ఏప్రిల్ 26 నుంచి జరగనున్నాయి. దీంతో జేఈఈ మెయిన్స్‌ను రెండుసార్లకే పరిమితం చేశారు. జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ ఈ నెలాఖరులోగా విడుదల కావచ్చు. 

Also read: SBI Recruitment 2022: డిగ్రీ విద్యార్హతతో ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News