బీజేపీతో పొత్తు లేదు: స్టాలిన్‌

Last Updated : Nov 9, 2017, 09:34 AM IST
బీజేపీతో పొత్తు లేదు: స్టాలిన్‌

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ డీఎంకే అధినేత కరుణానిధిని ఇంటికి వచ్చి పరామర్శించడం తమిళనాడులో రాజకీయ చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. మీడియా ఈ విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని ఆయన అన్నారు. ఈ విషయంపై స్టాలిన్ క్లారిటీ ఇచ్చారు. మోదీ వెళ్లిన తరువాత బుధవారం బ్లాక్ డే నిరసనల్లో పాల్గొనమంటూ, పాల్గొంటామంటూ  ప్రకటనలు చేసి అయోమయానికి గురిచేశారు డీఎంకే పార్టీ. ఎట్టకేలకు పాల్గొంటామంటూ స్టాలిన్ చెప్పడంతో నిరసనల్లో పాల్గొన్నారు ఆ పార్టీ నాయకులు. 

పెద్దనోట్లను రద్దుచేసి ఏడాదైన సందర్భంగా మధురైలో నిర్వహించిన బ్లాక్‌ డే నిరసనల్లో స్టాలిన్‌ పాల్గొన్నారు.  ప్రధాని మోదీ కరుణానిధిని చెన్నైలో కలవనున్నారనే సమాచారం తనకు ముందుగా తెలియని, తెలిసిన తరువాత హుటాహుటిన దుబాయ్ నుంచి వచ్చానని స్టాలిన్‌ తెలిపారు. కరుణానిధిని ప్రధాని మోదీ గారు సార్‌ పిలిచారు. ఢిల్లీకి వచ్చి మెరుగైన వైద్యం చేయించుకోవాలన్నారు. అక్కడి తన నివాసానికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలని మోదీ అన్నారు. ఆయన కేవలం పరామర్శించడానికే వచ్చారనీ, అంతేగానీ ఈ భేటీలో ఎటువంటి రాజకీయ ప్రస్తావన రాలేదని, బీజేపీతో పొత్తుపెట్టుకోమని స్టాలిన్‌ తెలిపారు. 

Trending News