Petrol, Diesel prices 14th August 2022: దేశం ఏదైనా పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. శ్రీలంక పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ దశలో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 500 లకు కూడా వెళ్లింది. పాకిస్తాన్‌లో కూడా పెట్రోల్ రేట్లు భారీగా పెరిగాయి. ఇక భారత దేశంలో సైతం చమురు ధరలు ఆల్‌టైం హైకి చేరుకున్నాయి. లీటరు ధర రూ.120 కూడా దాటింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో ధరల్లో భారీ మార్పు కనిపించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర రూ.9.50, డీజిల్ ధర రూ.7 తగ్గింది.
చివరిసారిగా మోదీ ప్రభుత్వం మే 21న పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దాంతో లీటర్ పెట్రోల్ ధరపై రూ.9.50, డీజిల్ ధరపై రూ.7 తగ్గింది. గత 84 రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత రాజస్థాన్, జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ తగ్గించి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు $98.15 వద్ద ట్రేడవుతున్నాయి. ఇది భారత్‌పై కూడా ప్రభావం చూపుతుంది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత రెండు నెలలకు పైగా నిలకడగా కొనసాగుతున్నాయి. నేడు (ఆగష్టు 14) పెట్రోల్ ధర రూ.109.66లుగా ఉండగా.. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విజయవాడ మార్కెట్‌లో ఇంధన ధరలు నేడు తగ్గాయి. పెట్రోల్ ధర నేడు రూ.0.59 పైసలు తగ్గి రూ.111.50గా ఉంది. డీజిల్ ధర రూ.0.54 పైసలు తగ్గి రూ.99.27 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర నేడు స్థిరంగా ఉంది. ఇవాళ పెట్రోల్ ధర రూ.110.48గా ఉండగా.. డీజిల్ ధర నేడు రూ.98.27గా ఉంది.
అయితే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చమురు ధరలు ఓసారి పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోనే బాదుడు ఎక్కువగా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.50గా ఉంది. మరోవైపు మెట్రో సిటీస్ చూసుకున్నా.. హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర ఎక్కువగా ఉంది. ఢిల్లీతో పోల్చితే.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.13 ఎక్కువగా ఉంది. చెన్నై, బెంగళూరుతో పోల్చితే.. రూ. 7 అధికంగా ఉంది.
# ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72లుగా ఉండగా.. డీజిల్ రూ.89.62లుగా ఉంది.
# ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.35లుగా ఉండగా.. డీజిల్ ధర రూ.97.28లుగా ఉంది.
# చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63లుగా ఉండగా.. డీజిల్ ధర రూ.94.24గా నమోదైంది.
# బెంగళూరులో పెట్రోల్ ధర రూ.101.94గా ఉండగా.. డీజిల్ లీటరుకు రూ.87.89గా ఉంది.
# హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.109.66లుగా ఉండగా.. డీజిల్ ధర రూ.97.82గా నమోదైంది.
Also Read: TTD Darshan Waiting Time Today: పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 48 గంటలు!
Also Read: బంగారం ప్రియులకు షాక్.. వరుసగా మూడో రోజు పెరిగిన పసిడి ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook