న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ అనంతరం తన కేబినెట్లోకి పలువురు నేతలను మంత్రులుగా తీసుకున్నారు. రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరి, సదానంద గౌడ, నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ థోమర్, రవిశంకర్ ప్రసాద్, రమేష్ పొక్రియాల్, అర్జున్ ముండా, స్మృతి ఇరాని, డా హర్షవర్థన్, ప్రకాశ్ జవదేకర్, పీయుష్ గోయల్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం జైశంకర్, డా థవార్ చంద్ గెహ్లట్ ప్రధానితోపాటే కేంద్ర కేబినెట్లో చేరిన వారి జాబితాలో ఉన్నారు.
Ramesh Pokhriyal Nishank, Harsimrat Kaur Badal and Arjun Munda take oath as Union Ministers. pic.twitter.com/npjYInHqRi
— ANI (@ANI) May 30, 2019
ముక్తార్ అబ్బాస్ నక్వి, ప్రహ్లాద్ జోషి, డా మహేంద్ర నాథ్ పాండే, గిరిరాజ్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్, సంతోష్ గంగ్వార్, రావు ఇందర్జిత్ సింగ్, శ్రీపాద్ నాయక్, జితేందర్ సింగ్, కిరెన్ రిజిజు, ప్రహ్లాద్ సింగ్ పటేల్, రాజ్‌కుమార్ సింగ్, హర్దీప్ సింగ్ పురి, ఫగ్గన్ సింగ్ కులస్తే, అశ్విన్ కుమార్ చౌబె, అర్జున్ రామ్ మేఘ్వాల్, వీకే సింగ్, క్రిషన్ పాల్, రావుసాహెబ్ దాదారావు దన్వె, గంగాపురం కిషన్ రెడ్డి, బాబుల్ సుప్రియో, సంజీవ్ బల్యన్, అనురాగ్ సింగ్ థాకూర్, ప్రతాప్ చంద్ర సారంగిలకు సైతం కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది.
Smriti Irani takes oath as Union Minister. #ModiSwearingIn pic.twitter.com/Js8PuW5ipg
— ANI (@ANI) May 30, 2019
ఎన్డీఏ మిత్ర పక్షాల నుంచి కేబినెట్లో చేరినవారిలో లోక్ జనశక్తి పార్టీ నేత రామ్ విలాస్ పాశ్వాన్, శిరోమణి అకాలీ దళ్ నాయకురాలు హర్సిమ్రత్ కౌర్ బాదల్, శివసేన నుంచి అరవింద్ సావంత్ ఉన్నారు.