close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

2022 కల్లా పీవోకే భారత్ వశమౌతుందని శివసేన ఎంపీ జోస్యం !!

మోడీ సర్కార్ నెక్ట్స్ టార్గెట్ పాక్ ఆక్రమిత కశ్మీర్ అంటున్న శివసేన !!

Updated: Sep 12, 2019, 12:44 AM IST
2022 కల్లా పీవోకే భారత్ వశమౌతుందని శివసేన ఎంపీ జోస్యం !!

శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) కూడా మన సొంతమవుతుందని..భారత ప్రజలు సంబరాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సరిగ్గా 2022 కల్లా పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత వశమౌతుందని జోస్యం చెప్పారు. కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి రద్దు  తరహాలోనే పీవోకే కూడా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అఖండ భారత్ వైపు అడుగులు వేస్తున్న మోడీ సర్కార్ పీవోకే కూడా సాధిస్తుందని సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు.

శివసేన పార్టీ మోడీ సర్కార్ కు మిత్రపక్షంగా ఉండటంతో సంజయ్ రౌత్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమా మోడీ సర్కార్ ఆలోచనను లీక్ చేశారా అన్నది తేలాల్సి ఉంది. కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు సమయంలో పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం మంత్రి పీవోకే కూడా సాధిస్తామనడం.. కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. మోడీ తర్వాతి అడుగు పీవోకే పైనే ఉంటుందన్నారు. ఇప్పడు తాజాగా శివసేన ఎంపీ మరో అడుగు ముందుకేసి 2022 కల్లా పీవోకే సాధిస్తామనడం గమనార్హం.