రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కూతురు శ్లోకాల వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. జూన్ 30న వీరి నిశ్చితార్థం జరగనుంది. కాగా.. బుధవారం రాత్రి ఆకాశ్, శ్లోకాల మెహందీ వేడుకలు ముంబైలోని అంబానీ రెసిడెన్సీలో ఘనంగా జరిగాయి.
ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలు షారూక్ ఖాన్, ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్, ప్రియాంకా చోప్రా, కరణ్ జోహార్ తదితరులు వచ్చారు. ఆకాశ్-శ్లోకాలకు విషెస్ తెలిపారు. ఆకాశ్, శ్లోకాలతో కలిసి దిగిన ఫొటోను ప్రియాంకా చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి నెటిజన్లతో పంచుకున్నారు. ఈ ఫొటోలో ఆకాశ్ తెలుపు.. శ్లోకా నీలం రంగు దుస్తుల్లో మెరిశారు. జూన్ 30న శనివారం వీరి నిశ్చితార్థ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనుండగా.. డిసెంబరులో వివాహం జరగనున్నట్లు సమాచారం.
ముఖేశ్ అంబానీ కుమార్తె, ఆకాశ్ సోదరి ఈశా వివాహం కూడా ఇటీవలే నిశ్చయమైన విషయం తెలిసిందే. పిరమాల్ సంస్థల వారసుడు అజయ్ పిరమాల్‌తో ఈశా వివాహం త్వరలోనే జరగనుంది.