ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యూల్ మాక్రోన్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ ఇరువురు నేతలు అక్కడ జరిగే అనేక కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు గంగా నది తీరంలో పడవ ప్రయాణం చేస్తారు. తొలుత ఈ ఇద్దరు నాయకులు మిర్జాపూర్‌కు బయలుదేరుతారు. వారణాసికి వచ్చే ముందు అక్కడ వారు సౌర విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. వారణాసిలో మరల ఈ ఇద్దరు నాయకులు దీన్ దయాళ్ హస్తకళా సంకుల్‌ను సందర్శిస్తారు. అక్కడి కళాకారులతో ముచ్చటిస్తారు.
Looking forward to hosting President @EmmanuelMacron in Varanasi tomorrow.
via NMApp pic.twitter.com/BNncEXTFGm
— Narendra Modi (@narendramodi) March 11, 2018
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్‌తో కలిసి వారణాసిలోని ప్రసిద్ధ అస్సీ ఘాట్ వద్దకు వెళ్తారు. అక్కడ వారు బోటు ప్రయాణం చేస్తూ గంగా ఘాట్‌లను తిలకిస్తారు. ఈ పడవ ప్రయాణం చారిత్రక దశాశ్వమేధ ఘాట్ వద్ద ముగుస్తుంది. ఫ్రెంచ్ అధ్యక్షుడికి గౌరవార్థం ప్రధాన మంత్రి మోదీ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం ప్రధానమంత్రి వారణాసిలోని మధుదిహి రైల్వే స్టేషన్ నుండి పాట్నాకు వరకు వెళ్లే రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు.
Visuals of preparations ahead of PM Narendra Modi & French President #EmmanuelMacron's visit to Varanasi. Both the leaders will visit Assi Ghat & Dashashwamedh Ghat. pic.twitter.com/k31gyWXHFG
— ANI UP (@ANINewsUP) March 12, 2018
Mirzapur: Visuals from the Solar Power Plant which will be inaugurated by Prime Minister Narendra Modi and President of France #EmmanuelMacron today. #UttarPradesh pic.twitter.com/mcW04O8JMi
— ANI UP (@ANINewsUP) March 12, 2018
ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్ ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించారు. శనివారం, మోదీ, మక్రోన్‌ల మధ్య చర్చలు ముగిశాక, భారతదేశం మరియు ఫ్రాన్స్ దేశాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారం పెంపొందించుకోవడానికి గాను రక్షణ, అణుశక్తి తదితర అంశాలతో సహా 14 ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఈ భేటీలో తీవ్రవాద అంశంపై కూడా చర్చలు జరిపినట్లు.. ఈ క్రమంలో ఇరువురు నేతలు టెర్రరిజాన్ని రూపుమాపడం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Held important talks with President @EmmanuelMacron. We discussed several areas of India-France cooperation, particularly in defence, security, trade and people-to-people ties. https://t.co/QbRofwXNtw pic.twitter.com/MhhxRkaK5T
— Narendra Modi (@narendramodi) March 10, 2018