జనవరి 9న అందుబాటులోకి రానున్న రియల్‌మి 5i స్మార్ట్ ఫోన్

మొబైల్ ప్రియులకు  రియల్‌మి ఇండియా సంస్థ సీఈఓ మాధవ్ సేథ్ మరో శుభవార్త అందించాడు. రియల్‌మి తన నూతన స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి 5i ను జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇందులో.. 6.5 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌ ఉన్నట్లు తెలిపారు.

Last Updated : Jan 6, 2020, 05:46 PM IST
జనవరి 9న అందుబాటులోకి రానున్న రియల్‌మి  5i స్మార్ట్ ఫోన్

హైదరాబాద్ : మొబైల్ ప్రియులకు  రియల్‌మి ఇండియా సంస్థ సీఈఓ మాధవ్ సేథ్ మరో శుభవార్త అందించాడు. రియల్‌మి తన నూతన స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి 5i ను జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇందులో.. 6.5 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌ ఉన్నట్లు తెలిపారు.

అంతేకాకుండా 3 GB  RAM , 32 GB స్టోరేజ్‌, డ్యుయల్‌ సిమ్ ఆండ్రాయిడ్‌ 9.0 పై, 12, 8, 2, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డ్యుయల్‌ 4G VOLTE, బ్లూటూత్‌ 5.0, 5000 Mah బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌.. తదితర ఫీచర్లను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఫోన్‌ ధర వివరాలను ఇంకా వెల్లడించకపోగా, ఈ మొబైల్ ను రూ.11,530 ధరకు విక్రయించనున్నారని సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News