Up election 2022: భాజపాకు మరో షాక్.. మరో మంత్రి గుడ్ బై..ఎస్పీలో చేరే అవకాశం?

Dharam Singh Saini: యూపీ రాజకీయాల్లో అనుహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ కీలక నేతలంతా భాజపాను వీడుతున్నారు. తాజాగా మరో మంత్రి కాషాయపార్టీని వీడారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 06:06 PM IST
  • యూపీ భాజపాకు మరో షాక్
  • మరో మంత్రి రాజీనామా
  • ఎస్పీలో చేరే అవకాశం!
Up election 2022: భాజపాకు మరో షాక్.. మరో మంత్రి గుడ్ బై..ఎస్పీలో చేరే అవకాశం?

Dharam Singh Saini Quit BJP: యూపీలో భాజపాకు (UP BJP) దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కాషాయ పార్టీ కీలకనేతలంతా వరుసగా రాజీనామాలు చేస్తున్నారు.  ఇప్పటికే ఇద్దరి కీలక నేతలను కోల్పోయింది యోగి ప్రభుత్వం. తాజాగా కేబినెట్​ మంత్రి ధరమ్​ సింగ్​ సైనీ (Dharam Singh Saini ) సహా ఎమ్మెల్యే ముకేశ్​ వర్మ (Mukesh Varma) భాజపా నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం ప్రకటించారు. కేవలం మూడు రోజుల్లో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు భాజపాను వీడారు. వీరిలో ముగ్గురు మంత్రులు ఉండటం విశేషం.

యోగి ప్రభుత్వంలో (Yogi Adityanath government) ఆయుశ్​ శాఖ మంత్రిగా నిబద్ధతతో పనిచేశానని సైనీ అన్నారు. కానీ వెనుకబడిన వర్గాలు, దళితులు, నిరుద్యోగ యువత, చిన్న, మధ్యతరగతి పరిశ్రమ వ్యాపారుల పట్ల భాజపా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ధోరణి అవలంభించడం వల్లే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. రాజీనామా అనంతరం ఎస్​పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ను ధరమ్​సింగ్​ సైనీ కలిశారు. సైనీ రాజీనామాను స్వాగతించిన అఖిలేశ్ ( Akhilesh Yadav)​.. ఆయన్న పార్టీలోకి ఆహ్వానించారు. సామాజిక న్యాయం కోసం పారాటం చేసే మరో నేత తమ పార్టీలో చేరుతున్నట్లు ట్వీట్​ చేశారు.

Also Read: Covid 19: బీజేపీ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం.. 50 మందికి పాజిటివ్...

ఇప్పటివరకు స్వామిప్రసాద్​ మౌర్య, దారా సింగ్​ చౌహాన్, రోషన్​ లాల్​, భగవతి సాగర్​, బ్రజేశ్​ ప్రజాపతి, అవతార్​ సింగ్​ భదానా, వినయ్​ శక్యా భాజపాను వీడారు. తాజాగా ధరమ్​ సింగ్​ సైనీ, ముకేశ్​ వర్మ రాజీనామాలతో ఈ సంఖ్య తొమ్మిదికి చేరింది. ఎమ్మెల్యే ముకేశ్​ వర్మ సమాజ్​వాదీ పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News