UPSC Prelims Results 2023: యూపీఎస్‌సి ప్రిలిమ్స్ 2023 ఫలితాలు విడుదల, https://upsc.gov.in ఇలా చెక్ చేసుకోండి

UPSC Prelims Results 2023: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రిలిమ్స్ 2023 ఫలితాలు వెల్లడయ్యాయి. గత నెలలో జరిగిన ఈ పరీక్షల ఫలితాలను యూపీఎస్‌సి అధికారిక వెబ్‌సైట్‌లో ఇలా చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 12, 2023, 05:36 PM IST
UPSC Prelims Results 2023: యూపీఎస్‌సి ప్రిలిమ్స్ 2023 ఫలితాలు విడుదల,  https://upsc.gov.in ఇలా చెక్ చేసుకోండి

UPSC Prelims Results 2023: యూపీఎస్‌సి 2022 తుది ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. ఇప్పుుడు ఈ ఏడాదికి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను యూపీఎస్‌సి ప్రకటించింది. దేశవ్యాప్తంగా 14,624 మంది సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌కు అర్హత సాధించారు. 

మే 2023లో జరిగిన యూపీఎస్‌సి ప్రిలిమ్స్ 2023 పరీక్ష ఫలితాలు ఇవాళ కాస్సేపటి క్రితం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మే 28వ తేదీన జరిగిన ఈ పరీక్షల్లో 14, 624 మంది ఉత్తీర్ణులయ్యాయరు. అంటే సెప్టెంబర్ 15 నుంచి జరిగే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా మొత్తం 1105 సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకై యూపీఎస్‌సి 2023 నోటిఫికేషన్ విడుదలై ఫిబ్రవరి 1 నుంచి 21 వరకూ దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది.

ప్రతియేటా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ వంటి అఖిల భారత సర్వీసుల్లో నియామకాలు యూపీఎస్‌సి చేపడుతుంది. ఎంపిక మూడు దశల్లో ఉంటుంది. మొదటిది ప్రిలిమ్స్ కాగా రెండవది మెయిన్స్. ఇక మూడవది ముఖాముఖి ఇంటర్వ్యూ. ఈ పరీక్షలనే సివిల్ సర్వీసెస్ పరీక్షలుగా కూడా పిలుస్తారు. ఇవాళ విడుదలైన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై సందేహాలుంటే..పని దినాల్లో ఉదయం 10 గంటల్నించి సాయంత్రం 5 గంటల్లోపు 011-23385271, 011-23098543, 011-23381125 నెంబర్లకు ఫోన్ చేసుకోవచ్చు. యూపీఎస్‌సి ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాల్ని అధికారిక వెబ్‌సైట్  https://upsc.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.

యూపీఎస్‌సి ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్ధులు డీటైల్డ్ అప్లికేషన్ ఫామ్-1 అంటే డీఏఎఫ్-1 అప్లై చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన వివరాలు త్వరలో వెబ్‌సైట్‌లో ఉంటాయి.

Also read: Indonesia: హనీమూన్​లో విషాదం... తమిళనాడుకు చెందిన వైద్య దంపతులు మృతి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News