'కరోనా వైరస్'.. మృత్యు ఘంటికలు మోగిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దీంతో భారత దేశ వ్యాప్తంగా అలజడి కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే అత్యధిక మరణాలు సంభవించడం కలకలం రేపుతోంది.
కరోనా మహమ్మారి మృత్యు క్రీడ ఆడుతోంది. భారత దేశంలో రోజు రోజుకు రికార్డుస్థాయిలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు రోజుల క్రితం ఒక్కరోజే 57 మంది చనిపోయారు. ఇప్పుడు మృతుల రికార్డుస్థాయి మరింతగా పెరిగింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 62 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. దీంతో దేశంలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 934కు చేరింది.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 29 వేల 435 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో 21, 632 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు 6 వేల 868 మందికి చికిత్స చేసి సురక్షితంగా అస్పత్రి నుంచి ఇంటికి పంపించారు. మొత్తంగా 934 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. మరోవైపు నిన్న ఒక్క రోజే 15 వందల 43 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
భారత్‌లో నిన్న ఒక్కరోజే 62 మంది మృతి