Papaya Fruit: బొప్పాయి తిన్న వెంటేనే వీటిని తింటున్నారా? ఇలా చేస్తే రిస్క్‌లో పడ్డట్లే!

Don't Eat This Fruits After Eating Papaya: బొప్పాయి తిన్న తర్వాత చాలా మంది ఈ కింది ఆహారాలను తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే బొప్పాయి పండు తిన్న తర్వాత ఎలాంటి ఆహారాలు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 16, 2023, 03:52 PM IST
Papaya Fruit: బొప్పాయి తిన్న వెంటేనే వీటిని తింటున్నారా? ఇలా చేస్తే రిస్క్‌లో పడ్డట్లే!

Don't Eat This Fruits After Eating Papaya: క్రమం తప్పకుండా బొప్పాయి పండును తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో లభించే ఆయుర్వేద గుణాలు జీర్ణక్రియను శక్తివంతంగా చేయడమే కాకుండా అనేక రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో అధిక పరిమాణంలో విటమిన్-ఎ, విటమిన్-సి, పొటాషియం లభిస్తాయి. కాబట్టి దీనిని చాలా మంది జుట్టు, చర్మ సమస్యలకు కూడా వినియోగిస్తారు. అయితే ఈ పండును ప్రతి రోజు తినేవారు కొన్ని చేయకూడని తప్పులు చేస్తున్నారు. ఈ పండ్లను తిన్న తర్వాత వెంటనే కొన్ని ఆహారాలను తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ పండ్లను తిన్న తర్వాత ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

పాల ఉత్పత్తులు:
పెరుగు, పాలు, జున్నులో ప్రోటీన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. బొప్పాయిలో ఉండే పపైన్ ఎంజైమ్ ప్రొటీన్లను గ్రహించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతి రోజు బొప్పాయిని తిన్న తర్వాత పాలు లేదా పెరుగును తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణుల తెలుపుతున్నారు. ముఖ్యంగా ప్రతి రోజు తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతిని, మలబద్ధకం, పొట్టలో వాపు, గ్యాస్‌ వంటి సమస్యలు కూడా రావచ్చు. 

గుడ్లు:
బొప్పాయి తిన్న తర్వాత పొరపాటున కూడా గుడ్లతో తయారు చేసిన ఆహారాలు తినకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా తీసుకోవడం వల్ల అజీర్ణం, వికారం, పొట్ట సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా కొంతమందిలో వాంతులు కూడా అవ్వొచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. 

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

ఫ్రూట్ చాట్:
ఫ్రూట్ చాట్ అనేక పండ్లతో కూడి సలాడ్‌గా కూడా భావించవచ్చు. దీనిని తిన్న తర్వాత బొప్పాయి పండును తీసుకుంటే జీర్ణక్రియ దెబ్బతినే ఛాన్స్‌లు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పండులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు అధికంగా లభిస్తాయి. కాబట్టి గ్యాస్‌, పొట్ట ఉబ్బరానికి కూడా దారి తీయోచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

చల్లటి నీరు:
బొప్పాయి తిన్న వెంటనే చల్లటి నీరు తాగడం కూడా ఆరోగ్యానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా జీర్ణక్రియ సమస్యలు కూడా సులభంగా వస్తాయి. అయితే బొప్పాయి తిన్న తర్వాత గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. 

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News