Control Iron Deficiency In 5 Days: ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల చాలా మందిలో ఐరన్ లోపం వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ లోపం వల్ల రక్తహీనత వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మంచి పోషకాలున్న ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతకంగా మరే అవకాశాలున్నాయి. ఇలాంటి సమస్యలు ప్రధానంగా రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఉత్పన్నవుతున్నాయి. దీని వల్ల మెదడు అభివృద్ధిపై ప్రభావం పడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ ఐరన్ లోపం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
ఐరన్ లోపం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వీటిని ఆహారంగా తీసుకోండి:
బీట్‌రూట్ జ్యూస్:
ఐరన్ లోపంతో బాధపడేవారు తప్పకుండా బీట్‌రూట్ రసాన్ని ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రసాన్ని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఐరన్, విటమిన్ సి, ఫోలేట్, మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఈ రసాన్ని ప్రతి రోజూ తీసుకుంటే కాలేయం నుంచి విడుదలయ్యే వ్యర్థాలు కూడా సులభంగా తొలగిపోతాయి. ముఖ్యంగా రక్త కోరత, అధిక రక్త పోటు సమస్యలతో బాధపడేవారికి కీలకంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తుంది.
ఎండిన రేగు పండ్లు:
ఎండిన రేగు పండ్ల రసంలో కూడా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఈ రసాన్ని ఐరన్ లోపంతో బాధపడేవారు ప్రతి రోజూ తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాకుండా అధిక రక్తపోటును సులభంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా రక్తంలో గ్లూకోజ్‌ను కూడా సులభంగా నియంత్రించేందుకు కూడా కీలకంగా సహాయపడుతుంది. అయితే దీనిని మధుమేహంతో బాధపడుతున్నవారు కూడా ప్రతి రోజూ తీసుకోవచ్చు.
గుమ్మడికాయ రసం:
మార్కెట్‌లో ప్రస్తుతం గుమ్మడికాయలు విచ్చల విడిగా లభిస్తున్నాయి. అయితే వాటి నుంచి తీసిన రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి ఐరన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. అంతేకాకుండా ఈ రసంలో పొటాషియం కూడా పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి శరీరాన్ని సీజనల్ వ్యాధుల నుంచి రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఐరన్ లోపం వంటి సమస్యతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ రసాన్ని తాగాల్సి ఉంటుంది.
గ్రీన్ జ్యూస్:
గ్రీన్ జ్యూస్ అంటే చాలా మంది తెలియదు. అయితే అన్ని రకాల ఔషధ గుణాలు కలిగిన ఆకులతో తయారు చేసిన రసాలను గ్రీన్ జ్యూస్ అని అంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఈ జ్యూస్‌ను ప్రతి రోజూ తాగడం వల్ల ఐరన్ లోపం సులభంగా తగ్గుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ రసానికి బదులుగా పండ్ల రసాలను కూడా తీసుకోవచ్చు.
Also read: AAP: ఆప్ దృష్టి ఇప్పుడు మహారాష్ట్రపై, త్వరలో బీఎంసీ ఎన్నికల్లో పోటీ
Also read: AAP: ఆప్ దృష్టి ఇప్పుడు మహారాష్ట్రపై, త్వరలో బీఎంసీ ఎన్నికల్లో పోటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook