Sweet Potatoes With Milk: కంద గడ్డలను ఇలా తింటే ప్రమాదకరమా.. ఎందుకు ఇలా తినకూడదో తెలుసా..?

Sweet Potatoes With Milk: కంద గడ్డలను ప్రతి రోజూ శీతాకాలం పాలలో వేసుకుని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా చలి కాలంలో తీసుకోవాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2022, 05:48 PM IST
Sweet Potatoes With Milk: కంద గడ్డలను ఇలా తింటే ప్రమాదకరమా.. ఎందుకు ఇలా తినకూడదో తెలుసా..?

How To Increases Immunity During Winter Season: చాలా మంది చలికాలంలో చిలగడదుంపలను తినేందుకు ఇష్టపడతారు. ఇందులో  యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి శరీరానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా సీజనల్‌ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అయితే శీతాకాలంలో చాలా మంది కందగడ్డలను వేడి పాలలో వేసుకుని తింటారు. అయితే ఇలా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ప్రచారం జరుగుతోంది. ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చలికాలంలో చిలగడదుంపను పాలతో కలిపి తింటే మంచిదేనా?:
కంద గడ్డను  పాలు కలిపి తింటే ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఇలా కలుపుకుని తినడం వల్ల శీరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. కాబట్టి చలి కాలంలో వీటిని పాలలో కలుపుకుని తినడం వల్ల సీజనల్‌ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జలుబు, దగ్గు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

కంద గడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది:
కంద గడ్డలో శరీరానికి కావాల్సిన పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌, కాల్షియం లభిస్తాయి. కాబట్టి  వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండెను ఆరోగ్యంగా  ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని కాపాడేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా వీటిని చలి కాలంలో తినడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Kriti Sanon Pics: ఓ మై గాడ్ అనిపిస్తున్న సీత అందాలు.. ఆలస్యం చేయకుండా హాట్ స్టిల్స్ చూసేయండి!

Also Read: waltair Veerayya Boss Party : పరుగులో ఆగిన బాలయ్య.. దూసుకుపోతోన్న చిరంజీవి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News