Headache Home Remedies: తల నొప్పిని 5 నిమిషాల్లో తగ్గించే నెంబర్‌ వన్‌ టిప్స్‌ ఇవే..

Headache Home Remedies: తరచుగా తల నొప్పి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా తల నొప్పిని తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 29, 2023, 12:59 PM IST
Headache Home Remedies: తల నొప్పిని 5 నిమిషాల్లో తగ్గించే నెంబర్‌ వన్‌ టిప్స్‌ ఇవే..

Home remedy for headache: భారత్‌లో ఎండా కాలం ముగిసి వానా కాలం ప్రారంభమైంది. వర్షాకాలం ప్రారంభంలో వాతావరణంలో తేమ తీవ్రత పెరుగుతుంది. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వానా కాలంలో చాలా మందిలో జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి వంటి సమస్యల బారిన పడతారు. ప్రస్తుతం చాలా మందిలో తేమ తీవ్రత కారణంగా తలనొప్పిలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఈ రెమెడీస్‌ని వినియోగించడం వల్ల నిమిషాల్లో ఉపశమనం లభించడమేకాకుండా..తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. తరచుగా తల నొప్పులతో బాధపడేవారు ఎలాంటి రెమెడీస్‌ను వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వీటితో తల నొప్పి నిమిషాల్లో మాయం..
అల్లం: 

తలలో వాపులా తయారైన రక్తనాళాల వాపును తగ్గించేందుకు అల్లం ప్రధాన పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా అల్లం రసం తాగడం వల్ల తలనొప్పి సమస్యల రాకుండా ఉపశమనం లభిస్తుంది. తరచుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు తల నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు అల్లం రసం తాగాల్సి ఉంటుంది. 

Also Read: Asin divorce Rumors: 'ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు..': నటి ఆసిన్ 

గోరు వెచ్చని నీటితో నిమ్మ రసం:
తల నొప్పిని ప్రభావంతంగా తగ్గించేందుకు ఈ డ్రింక్‌ ఎఫెక్టివ్ పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తీవ్ర తల నొప్పి సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల పొట్టలో గ్యాస్‌తో పాటు ఈ సమస్య నుంచి నిమిషాల్లో ఉపశమనం పొందవచ్చు. 

పుదీనా: 
పొట్ట సమస్యలను ప్రభావంతంగా తగ్గించేందుకు పుదీనా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే  మెంతోన్, మెంథాల్ మూలకాలు తల నొప్పి నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. దీని కోసం ప్రతి రోజు పుదీనా ఆకులతో తయారు చేసిన రసాన్ని నుదిటిపై అప్లై చేసుకోవాలి.

తులసి: 
తరచుగా తల నొప్పి సమస్యలతో బాధపడుతున్నవారు తులసి ఆకులను నమిలి తినడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అయితే వీటిని తినే క్రమంలో తేనెను వినియోగించి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Asin divorce Rumors: 'ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు..': నటి ఆసిన్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News