How To Control Uric Acid: ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల చాలా మంది యూరిక్ సమస్యలతో బాధపడుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ అధిక పరిమాణంలో పెరిగిపోవడం వల్ల తీవ్రమైన కీళ్ల నొప్పులతో పాటు మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. రక్తంలో యూరిక్ యాసిడ్ ప్యూరిన్స్ అనే రసాయనాలు విచ్ఛిన్నం కావడం వల్ల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్యూరిన్లు బఠానీలు, బచ్చలికూర, ఆంకోవీస్, పుట్టగొడుగులు, ఎండిన బీన్స్ ఆకారాల్లో కనిపిస్తాయి.
శరీరంలో ఉత్పత్తి అయ్యే యూరిక్ యాసిడ్ చాలా వరకు రక్తంలో కరిగి మూత్రపిండాల ద్వారా విసర్జించబడుతుంది. ఒక వేళా రక్తంలోని యూరిక్ యాసిడ్ బయటకు రాకపోతే హైపర్‌యూరిసెమియాకు దారితీస్తుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తరచుగా పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది.
ఊబకాయం లేదా అధిక బరువు సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతుంటారు. వీరిలో కీళ్లలో ఘన స్ఫటికాలాగా పేరుకుపోయి గౌట్‌కు కారణమవుతుంది. అంతేకాకుండా ఇది కొందరిలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలకు దారీ తీసే ఛాన్స్ కూడా ఉంది. ఈ యాసిడ్ తీవ్రతరమైతే మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది.
యూరిక్ యాసిడ్ తగ్గించడానికి ఇంటి చిట్కాలు:
యూరిక్ యాసిడ్ సాధారణంగా పురుషులలో 3.4 నుంచి 7 mg / dL, మహిళల్లో 2.4 నుంచి 6 mg / dL వరకు ఉండాలి. అయితే అతిగా యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు వాటర్‌ను ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా శరీరానికి ఆరోగ్యాన్ని అందించే తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ చిట్కాలు పాటించడం వల్ల కూడా సులభంగా ఉపశమనం పొందొచ్చు.
Also Read: Ajinkya Rahane IPL: రఫ్పాడిస్తున్న అజింక్యా రహానే.. ఆ టైమింగే వేరప్పా..!
ఆపిల్ వెనిగర్:
యూరిక్ యాసిడ్ తగ్గించడానికి.. ప్రతిరోజూ ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ని గ్లాసు నీటిలో కలిపి తాగాల్సి ఉంటుంది. వెనిగర్ సహజమైన క్లెన్సర్, డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. ఇందులో మాలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. కాబట్టి సులభంగా శరీరంలో యూరిక్ యాసిడ్‌ను విచ్ఛిన్నం చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
నిమ్మ రసం:
రక్తంలో పేరుకుపోయిన అదనపు యూరిక్ యాసిడ్‌ను తొలగించడానికి కనీసం రెండుసార్లు నిమ్మరసం తాగాలి. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది యూరిక్ యాసిడ్‌ను కరిగించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఉసిరి, జామ, నారింజ వంటి విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆహారాలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల కూడా సులభంగా మంచి ఫలితాలు పొందొచ్చు.
Also Read: Ajinkya Rahane IPL: రఫ్పాడిస్తున్న అజింక్యా రహానే.. ఆ టైమింగే వేరప్పా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి