Home Remedies for White Hair in Eyebrows: కనుబొమ్మల్లో తెల్ల వెంట్రుకలని మటుమాయం చేసేందుకు సహజ పద్ధతులు

Home Remedies for White Hair in Eyebrows: కనుబొమ్మల్లో తెల్ల వెంట్రుకలను తగ్గించుకోవడం కోసం హోమ్ రెమెడిస్ రూపంలో మీ ఇంట్లోనే కొన్ని చిట్కాలు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా తెల్ల వెంట్రుకలను సహజ పద్ధతిలో తిరిగి సహజ రంగులోకి వచ్చేలా చేసే మార్గాలేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం రండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2023, 10:18 PM IST
  • అసలు కనుబొమ్మల్లో తెల్ల వెంట్రుకలు రావడానికి కారణాలు ఏంటి
  • కనుబొమ్మల్లో తెల్ల వెంట్రుకలను పోగొట్టడానికి ఉన్న వంటింటి చిట్కాలు ఏంటి
  • కనుబొమ్మల వెంట్రుకల కోసం ఏయే న్యాచురల్ డైస్ అందుబాటులో ఉన్నాయి
  • కనుబొమ్మల్లో తెల్ల వెంట్రుకలు రాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి
Home Remedies for White Hair in Eyebrows: కనుబొమ్మల్లో తెల్ల వెంట్రుకలని మటుమాయం చేసేందుకు సహజ పద్ధతులు

Home Remedies for White Hair in Eyebrows: నడి వయస్సు దాటాకా వయస్సు పెరిగే కొద్ది చాలామందిలో సర్వసాధారణంగా కనిపించే సమస్య కనుబొమ్మల్లో తెల్ల వెంట్రుకలు రావడం. దీనిని కొంతమంది సమస్యగా భావిస్తే.. ఇంకొంతమంది లైట్ తీసుకుని సాధ్యమైనంత వరకు తమ ఒరిజినల్ కలర్ ని మెయింటెన్ చేయడానికే ఇష్టపడుతుంటారు. అయితే, అదృష్టవశాత్తుగా దీనిని ఒక సమస్యగా భావించే వారికోసం కొన్ని హోమ్ రెమెడిస్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఆ హోమ్ రెమెడీస్ ఉపయోగించి కనుబొమ్మల్లో తెల్ల వెంట్రుకలను సహజ పద్ధతిలో పూర్వం ఉన్న సహజ రంగులోకి తీసుకురావచ్చు. కనుబొమ్మల్లో తెల్ల వెంట్రుకలను తిరిగి ఒరిజినల్ కలర్ లోకి తీసుకొచ్చే ఆ హోమ్ రెమెడీస్ ఏంటి ? అందుకోసం అందుబాటులో ఉన్న న్యాచురల్ డైస్ ఏంటి ? ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనే అంశాలను తెలుసుకుందాం రండి.

అసలు కనుబొమ్మల్లో తెల్ల వెంట్రుకలు రావడానికి కారణాలు ఏంటి 
కనుబొమ్మల్లో తెల్ల వెంట్రుకలను పోగొట్టడానికి ఉన్న వంటింటి చిట్కాలు ఏంటి
కనుబొమ్మల వెంట్రుకల కోసం ఏయే న్యాచురల్ డైస్ అందుబాటులో ఉన్నాయి
కనుబొమ్మల్లో తెల్ల వెంట్రుకలు రాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి
తరచుగా అడిగే ప్రశ్నలు
ముగింపు

కనుబొమ్మల్లో తెల్ల వెంట్రుకలు రావడానికి కారణాలు 
కనుబొమ్మల్లో తెల్ల వెంట్రుకల నివారణకు వంటింటి చిట్కాలు తెలుసుకోవడానికంటే ముందుగా.. అసలు కనుబొమ్మల్లో తెల్లవెంట్రుకలు ఎందుకు వస్తాయో తెలుసుకోవాలి. చాలామందిలో కనుబొమ్మల వెంట్రుకలు తెల్లబడటానికి కారణం వారికి వయస్సు పెరుగుతుండటమే. ఎందుకంటే.. వయస్సు పెరిగేకొద్ది వారిలో మెలానిన్ అనే పిగ్మెంట్ తక్కువ స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. కానీ వెంట్రుకలు సహజ రంగు కోల్పోకుండా ఉండటానికి ముఖ్యంగా కావాల్సిందే ఈ మెలానిన్ పెగ్మెంట్. ఇదేకాకుండా మానసిక ఒత్తిడి, జీన్స్, మెడికల్ కండిషన్స్ వంటి ఇతర కారణాలు కూడా వెంట్రుకలు తెల్లబడటానికి దారితీస్తాయి.

కనుబొమ్మల్లో తెల్ల వెంట్రుకల నివారణ కోసం వంటింటి చిట్కాలు

ఉల్లిపాయ జ్యూస్: తెల్లవెంట్రుకల నివారణ కోసం ఉల్లిపాయ జ్యూస్ మెరుగ్గా పనిచేస్తుంది. అందుకోసం మీరు చేయాల్సిందల్లా.. ఒక ఉల్లిగడ్డ నుంచి రసాన్ని తీసి కనుబొమ్మలకు అప్లై చేయాలి. ఆ తరువాత 30 నిమిషాలు వదిలేసి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేస్తే ఉత్తమమైన ఫలితాలు కనిపిస్తాయి. 

కోకోనట్ ఆయిల్, నిమ్మకాయ రసం: కొబ్బరి నూనె, నిమ్మరసం సమానమైన మోతాదులో తీసుకుని ఒక మిశ్రమంగా కలపాలి. ఆ మిశ్రమాన్ని కనుబొమ్మలకు అప్లై చేసి అర్ధగంట తరువాత కడిగేయాలి. అలా చేయడం వల్ల కొబ్బరి నూనె మీ వెంట్రుకలను మాయిశ్చరైజ్ చేసి కండిషనర్‌గా పనిచేస్తుంది. అలాగే నిమ్మకాయ రసం మీ వెంట్రుకలను న్యాచురల్ బ్లీచ్ చేస్తుంది.

బ్లాక్ టీ: బ్లాక్ టీ కాచిన తరువాతి అది చల్లారే వరకు అలాగే వదిలేయండి. చల్లార్చిన బ్లాక్ టీని బంతిలా చేసిన దూదితో కనుబొమ్మలకు అప్లై చేయండి. అలా 15 నిమిషాల పాటు వదిలేసిన తరువాత మీ ముఖం కడుక్కోండి. బ్లాక్ టీలో ఉండే టానిన్స్ మీ వెంట్రుకల రంగును నలుపు రంగులోకి మార్చి తెల్లవెంట్రుకలు కనబడకుండా చేస్తాయి.

కనుబొమ్మల్లో వెంట్రుకలకు న్యాచురల్ డైస్

హెన్నా: హెన్నా ఒక న్యాచురల్ డైగా చెబుతుంటారు. హెన్నాను ఉపయోగించి మీ వెంట్రుకలను నలుపు రంగులోకి మార్చుకోవచ్చు. హెన్నా పౌడర్ ని నీటితో కలిపి ఒక మిశ్రమంగా తయారు చేసి కనుబొమ్మలకు రుద్ది ఒక 30 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. సురక్షిత పద్ధతిలో తెల్లవెంట్రుకలను నల్లగా మార్చుకోవడానికి హెన్నా మెరుగ్గా పనిచేస్తుంది.

ఇండిగో పౌడర్: తెల్లవెంట్రుకలను నల్ల రంగులోకి మార్చుకోవడానికి మీ ముందున్న మరో మార్గం ఇండిగో పౌడర్. ఇండిగో పౌడర్‌ని నీటితో కలిపి ఒక మిశ్రమంగా తయారు చేసి కనుబొమ్మలకు అప్లై చేయాలి. ఆ తరువాత 30 నిమిషాలకు కనుబొమ్మలను క్లీన్‌గా కడుక్కోండి.

తెల్ల వెంట్రుకల నివారణ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

విటమిన్ బి12 అధికంగా తీసుకోండి: వెంట్రుకలు పెరగడంలో విటమిన్ బి12 ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా బాలనెరుపుని నివారించడానికి కూడా విటమిన్ బి12 చాలా ఉపయోగపడుతుంది. మాంసం, గుడ్లు, చేపలు, పాల పదార్థాలలో విటమిన్ బి12 అధిక మోతాదులో ఉంటుంది. 

సమతుల్యమైన ఆహారం: పండ్లు, కూరగాయలు, వోల్ గ్రెయిన్స్ వంటి ఫుడ్ ఐటమ్స్ ఆహారంగా తీసుకోవడం ద్వారా వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు తెల్లబడటాన్ని నివారించవచ్చు. 

తరచుగా కలిగే సందేహాలు

ప్రశ్న    : మానసిక ఒత్తిడి కనుబొమ్మల్లోని వెంట్రుకలను తెల్లబడేలా చేస్తుందా ?

జవాబు : అవును ఒత్తిడి, ఆందోళనల వల్ల చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం జరుగుతుంది. కనుబొమ్మల్లో తెల్ల వెంట్రుకలు రావడానికి కూడా అది ఒక కారణంగా భావించవచ్చు.  

ప్రశ్న    : కనుబొమ్మలకు న్యాచురల్ డైస్ లాంటివి ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా ? 

జవాబు : హెన్నా, ఇండిగో పౌడర్ లాంటి న్యాచురల్ హెయిర్ డైస్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి పూర్తి సురక్షితం. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. మీకు న్యాచురల్ డై వల్ల ఎలర్జీ రాదని నిర్ధారించుకోవడం కోసం న్యాచురల్ డై ఏదైనా.. దానిని వినియోగించడానికి ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది.  

ప్రశ్న    : కనుబొమ్మల్లోని తెల్లవెంట్రుకలపై వంటింటి చిట్కాల పనితీరు ఫలితం కనబడటానికి ఎంత కాలం పడుతుంది ?

జవాబు : వెంట్రుకలు తెల్లబడిన తీవ్రతనుబట్టి ఈ ఫలితం కనపడేందుకు పట్టే సమయం ఒక్కొక్కరి విషయంలో ఒకలా ఉంటుంది. ఒక్కోసారి సరైన ఫలితాలు కనపడేందుకు వారాల వ్యవధి నుంచి నెలల సమయం కూడా పడుతుంది.

ప్రశ్న    :  కనురెప్పలపై కూడా ఈ హోమ్ రెమెడిస్ ఉపయోగించవచ్చా ? 

జవాబు : కనురెప్పలపై ఇలాంటి రెమెడీస్ ని ఉపయోగించకూడదు. ఎందుకంటే అవి కొన్నిసార్లు కళ్లలో మంటకు దారితీస్తాయి.

ముగింపు:
నడి వయస్సు దాటాకా వయస్సు పెరిగే కొద్ది చాలామందిలో సర్వసాధారణంగా కనిపించే సమస్య కనుబొమ్మల్లో తెల్ల వెంట్రుకలు రావడం. దీనిని కొంతమంది సమస్యగా భావిస్తే.. ఇంకొంతమంది లైట్ తీసుకుని సాధ్యమైనంత వరకు తమ ఒరిజినల్ కలర్ ని మెయింటెన్ చేయడానికే ఇష్టపడుతుంటారు. అయితే, అదృష్టవశాత్తుగా దీనిని ఒక సమస్యగా భావించే వారికోసం కొన్ని హోమ్ రెమెడిస్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఆ హోమ్ రెమెడీస్ ఉపయోగించి కనుబొమ్మల్లో తెల్ల వెంట్రుకలను సహజ పద్ధతిలో పూర్వం ఉన్న సహజ రంగులోకి తీసుకురావచ్చు.

న్యాచురల్ డైస్ నుంచి సమతుల్యమైన ఆహారం వరకు ఈ కథనంలో ప్రస్తావించిన వంటింటి చిట్కాలు అన్నీ సురక్షితమైనవే. అయితే, ఫలితాలు కనబడేందుకు కొన్నిసార్లు సమయం పడుతుంది కనుక ఈ చిట్కాలు ఉపయోగించేటప్పుడు ఓపిగ్గా ఉండటం మర్చిపోవద్దు. ఈ సహజ పద్ధతులను మీ డైలీ రొటీన్ లో భాగంగా చేసుకున్నట్టయితే.. చిన్న వయస్సులో కనుబొమ్మల వెంట్రుకలు తెల్లబడటం లాంటి సమస్యల బారి నుంచి తప్పించుకోవడమే కాకుండా వాటిని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి : Jaggery Vs Sugar: మీ ఆరోగ్యానికి షుగర్ మంచిదా ? లేక బెల్లం మంచిదా ?

ఇది కూడా చదవండి : Blueberries Health Benefits: బ్లూబెర్రీస్.. తింటే ఆల్ హ్యాపీస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News