Oils For Premature White Hair: చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!

Oils For Premature White Hair: ఆధునిక జీవన శైలికారణంగా తెల్లజుట్టు సమస్య సర్వసాధారణమైపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ప్రస్తుతం మార్కెట్‌లో లభించే హెయిర్‌ ప్రోడక్ట్‌ను వాడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2022, 12:47 PM IST
  • చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుందా..
  • కొబ్బరి నూనెలో ఆమ్లా పోడిని కలిపి..
  • జుట్టుకు పట్టిస్తే సమస్యలు మటు మాయం
Oils For Premature White Hair: చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!

Oils For Premature White Hair: ఆధునిక జీవన శైలికారణంగా తెల్లజుట్టు సమస్య సర్వసాధారణమైపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ప్రస్తుతం మార్కెట్‌లో లభించే హెయిర్‌ ప్రోడక్ట్‌ను వాడుతున్నారు. కానీ కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ప్రస్తుతం చాలా మంది సహజసిద్ధమైన మూలకాలతో ఈ సమస్య నుంచి విముక్తి పొందాలని అనుకుంటున్నారు. అయితే జుట్టు సహజంగా నల్లగా మారడానికి.. కొన్ని నూనెలను ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ నూనెల సహాయంతో తెల్ల జుట్టు నల్లగా మారుతుంది:

కొబ్బరి నూనెలో ఆమ్లా పోడి:

కొబ్బరి నూనె వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు.. కానీ మీరు అందులో ఉసిరికాయను ఎండబెట్టి పొడితో ఈ కొబ్బరి నూనెలో వేసి తలకు పట్టిస్తే వెంట్రుకలు సహజంగా నల్లగా మారుతాయి.

కలోంజి ఆయిల్, ఆలివ్ ఆయిల్:

సోపు నూనె, ఆలివ్ నూనె జుట్టు నల్లబడటానికి చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. దీని కోసం సోపు నూనెలో ఒక టీస్పూన్ ఆలివ్ నూనెను మిక్స్ చేసి.. ఆపై 30 నిమిషాల తర్వాత జుట్టుకు బాగా మసాజ్ చేయండి.

కొబ్బరి నూనె, మెహందీ ఆకులు:

కొబ్బరి నూనెతో పాటు హెన్నాను కూడా జుట్టు ఔషధమని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొంది. 25 నుంచి 30 సంవత్సరాల వయస్సులో జుట్టు నల్లగా మారినట్లయితే.. ఖచ్చితంగా ఈ రెమెడీని తూ.చ తప్పకుండా పాటించండి. దీని కోసం 8 చెంచాల కొబ్బరి నూనెను ఉడకబెట్టండి. అందులో పచ్చి గోరింట ఆకులను వేయండి. చల్లారాక జుట్టుకు మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా వాడడం వల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also read: Bank Holidays July: జూలై నెలలో బ్యాంక్ పనులుంటే సమస్యే..16 రోజులు సెలవులు, ఇదే సెలవుల జాబితా

Also read: Pisces Monthly Horoscope 2022: ఈ రాశి వారికి ఈ నెలంతా లాభాలే.. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

 

Trending News