Musk Melon Smoothie: వేసవిలో బాడీ కూల్ చేసే కర్బూజ స్మూతీ..!

Musk Melon Smoothie Benefits: వేసవి కాలంలో ఎండలు మండిపోతుంటాయి. ఈ సమయంలో బయటకు వెళ్ళలేము. అయితే ఈ వేసవికాలంలో చాలా మంది శీతల పానీయాలపై ఆధార పడుతుంటారు. శరీరం ఎక్కువగా డీహైడ్రేట్ కావడం వల్ల కూల్‌ డ్రీంక్స్‌ తీసుకోవాలని అనిపిస్తుంది. అయితే ఇంట్లో మనం జ్యూస్ తయారు చేసుకోవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2024, 09:10 PM IST
Musk Melon Smoothie: వేసవిలో బాడీ కూల్ చేసే  కర్బూజ స్మూతీ..!

Musk Melon Smoothie Benefits: వేసవికాలంలో బయట అనేక రకాల కూల్‌ డ్రీంక్స్‌ లభిస్తాయి. ఈ సమయంలో శరీరం ఎంతో డీహైడ్రేట్‌ అవుతుంది. శరీరానిని హైడ్రేట్‌ చేసుకోవడానికి చాలా మంది తీపి పానీయాలు , కెమికల్స్‌, గ్యాస్‌తో కూడిన  తీసుకుంటారు. కానీ దీని వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. కాబట్టి వేసవికాలంలో పండ్లలతో తయారు చేసిన జ్యూస్‌ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. ఈ ఎండలకు కర్బూజతో తయారు చేసిన 
స్మూతీని తీసుకోవడం వల్ల రిఫ్రిష్‌గా ఉంటుంది. 

కర్బూజ తయారు చేసుకోవడం ఎంతో సులభం. దీని కోసం ఇంట్లో లభించే కొన్ని పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది. దీని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.  కర్బూజ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

కర్బూజ స్మూతీకి కావాల్సిన పదార్థాలు:

కర్బూజ ముక్కలు - 2 కప్పులు
పెరుగు - 1 కప్పు
తేనె - 2 టేబుల్ స్పూన్లు 
పాలు - 1/2 కప్పు 
ఐస్ క్యూబ్స్ - 4-5

కర్బూజ స్మూతీ తయారీ విధానం:

కర్బూజ ముక్కలను, పెరుగు, తేనె, ఐస్ క్యూబ్స్ ను ఒక బ్లెండర్ లో వేసి బాగా మిక్సీ చేసుకోవాలి. దీని చాలా చిక్కగా చేసుకొని కొంచెం పాలు కలిపి మళ్లీ మిక్సీ చేయండి.స్మూతీలో కొన్ని చుక్కల నిమ్మరసం లేదా యాలకుల పొడి కూడా కలపవచ్చు.స్మూతీని ఒక గ్లాసులో పోసి తీసుకోవాలి. ఈ విధంగా కర్బూజ స్మూతీని తయారు చేసుకొని తాగుతే శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. 

చిట్కాలు:

మీరు స్మూతీలో మరింత రుచిని కోరుకుంటే, మీరు కొన్ని బెర్రీలు, అరటిపండు లేదా మామిడి ముక్కలను కూడా కలపవచ్చు.
మీరు స్మూతీని మరింత చల్లగా చేయాలనుకుంటే, మీరు ఐస్ క్యూబ్స్ ను ఎక్కువగా వేయవచ్చు.
మీరు స్మూతీని మరింత ఆరోగ్యకరంగా చేయాలనుకుంటే, మీరు పెరుగు బదులుగా పెరుగు పాలను ఉపయోగించవచ్చు.
కర్పూజ స్మూతీ యొక్క ప్రయోజనాలు:

కర్పూజ స్మూతీ ఒక రిఫ్రెష్ డ్రింక్, ఇది వేసవిలో చాలా బాగా పనిచేస్తుంది.
ఇది విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది.
ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది.
ఇది జీర్ణక్రియకు మంచిది.
ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది

 

Also Read Ibomma: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

 

 

 

 

 

 

 

 

Trending News