Easy Poha Chilla For Breakast: అటుకులతో మనం ఉగ్గాణి, స్నాక్ ఐటెం వంటివి తయారు చేసుకుంటాం. ఇది ఎంతో ఆరోగ్యకరం కూడా. అయితే, అటుకులతో ఈజీగా చిల్లా తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? బ్రేక్‌ఫాస్ట్‌లో సులభంగా ఏ హడావుడి లేకుండా తయారు చేసుకోవచ్చు. దీనికి ఇంట్లోని సింపుల్ వస్తువులతో తయారు చేసుకోవచ్చు. ఎక్కువ సమయం కూడా పట్టదు.
ఈ ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ రిసిపీ ఎంతో రుచికరంగా ఉంటుంది. నిమిషాల్లోనే ఈ రిసిపీ రెడీ అయిపోతుంది. కేవలం అటుకులు, ఇంట్లోని ఆహార పదార్థాలతో సులభంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
పోహా చిల్లాకు కావాల్సిన పదార్థాలు..
పోహా-కప్పు
శనగపిండి- అరకప్పు
ఉల్లిపాయలు - అరకప్పు
టమాటాలు- పావుకప్పు
క్యాప్సికం- పావుకప్పు
పచ్చిమిర్చి-3
కొత్తిమీర కట్ చేసింది.
అల్లం- గ్రేట్ చేసినది
పసుపు-1/2 టీస్పూ్
జిలకర్ర-1/2
ఉప్పు -రుచికి సరిపడా
తగినన్ని నీరు
నూనె లేదా నెయ్యి
ఇదీ చదవండి: వారానికి ఒక్కసారైనా ఈ కూరగాయ తినండి.. మీ గుండె ఉక్కులా మారుతుంది..
పోహా చిల్లా తయారీ విధానం..
ఈ సులభమైన అటుకుల చిల్లా తయారు చేసుకోవడానికి కూరగాయలు అన్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అటుకులు శుభ్రంగా కడగాలి. ఓ ఐదు నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీటిని వంపేసి ఓ పక్కన పెట్టుకోవాలి.
ఇదీ చదవండి: ఫేస్‌వాష్ అయిపోయిందా? మీ ఇంట్లోనే 4 నేచురల్ ఎక్స్ఫోలియేటర్స్ ఉన్నాయి తెలుసా?
ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో నానబెట్టిన అటుకుల, శనగపిండి రెండూ వేసి బాగా బీట్ చేసుకోవాలి లేదా బ్లెండ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ, క్యాప్సికం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, జిలకర్ర, ఉప్పు చిల్లాకు కావాల్సిన నీరు వేసుకోవాలి.
ఆ తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని దానిపై నూనెతో గ్రీజ్ చసుకోవాలి. ఇప్పుడు ఓ గరిటె తీసుకుని దాన్ని దోశ మాదిరి ప్యాన్ పై వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. పైనుంచి కాస్తు ఆయిల్ లేదా నెయ్యి కూడా వేసుకోవాలి. దీన్ని ఓ మూడు నిమిషాలపాటు ఉడికించుకోవాలి. మీడియం మంటపై గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు ఉడికించండి. మెల్లిగా స్పాట్యూల సహాయంతో మరోవైపు తిప్పుకుని మూడు నిమిషాల పాటు ఉడికించండి. అంతే రుచికరమైన చిల్లా రెడీ అయినట్లే దీన్ని వేడివేడిగా పుదీనా చట్నీ, టమాటా కెచప్‌లో తింటే రుచి అదిరిపోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter