How To Manage Blood Pressure Naturally: అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ లాంటిది. ఎందుకంటే దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు కొందరిలో ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. అధిక రక్త పోటు వల్ల కిడ్నీ దెబ్బతినడం, గుండె పోటు, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. కాబట్టి రక్త పోటు సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా నియంత్రించుకోవడం చాలా మంచిది..లేకపోతే ప్రమాదమే. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా జీవన శైలిలో మార్పులు చేర్చుపులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన పలు రకాల ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
అధిక రక్త పోటు ఉన్న వారు తప్పకుండా ఈ ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది:
1) నల్ల మిరియాల:
నల్ల మిరియాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. అంతేకాకుండా ఇవి వంటకాల్లో వినియోగిస్తే వంటలన్నీ రుచికరంగా మారుతాయి. వీటిని శీతాకాలంలో వినియోగిస్తే.. సీజనల్ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా వీటిని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కూడా తీసుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో నల్ల మిరియాల పొడిని వేసుకుని తాగితే అధిక రక్త పోటు కూడా తగ్గుతుంది.
2) ఉసిరి:
ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రక్త పోటును నియంత్రించడానికి సహాయపడతాయి. కాబట్టి తరచుగా బీపీ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఉసిరికాయను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
3) వెల్లుల్లి:
వెల్లుల్లిలో యాంటీ-హైపర్‌టెన్సివ్ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటే అధిక బీపీ సమస్యలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు, చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవడానికి తప్పకుండా వెల్లుల్లి ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
4) బ్లాక్ రైసిన్లు:
డ్రైఫ్రూట్స్ శరీరానికి చాలా మంచివి. ఇందులో నల్ల ద్రక్షలు శరీరానికి చాలా లాభాలను చేకూర్చుతుంది. ఇందులో ఉండే గుణాలు రక్త పోటును నియంత్రించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా సులభంగా అనారోగ్య సమ్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also Read: Man Raped Dog: సభ్యసమాజం తలదించుకునే ఘటన.. వీధి కుక్కపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం! వైరల్ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook