Sarva Pindi Recipe In Telugu: సర్వ పిండి అనేది తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక ప్రాచీనమైన, సాంప్రదాయ వంటకం. ఇది బియ్యం పిండి, శనగపప్పు, నువ్వులు, మసాలా దినుసులతో తయారుచేసే ఒక రుచికరమైన చిరుతిండి. తెలంగాణలోని పల్లె ప్రాంతాల్లో ఇప్పటికీ ఓ మంచి చిరుతిండిగా కొనసాగుతూ వస్తోంది. సర్వ పిండిని సాధారణంగా ఉదయం అల్పాహారం లేదా సాయంత్రం చిరుతిండిగా తింటారు. ఇతర స్నాక్స్‌తో పోలిస్తే, ఇది ఎంతో హెల్తీ.. కాబట్టి మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. దీని తయారీ కేవలం పల్లె ప్రాంతాల్లో నివసించేవారికి ఎక్కువగా తెలుస్తుంది. అయితే మేము అందించే ఈ పద్ధతిలో చేస్తే మీరు కూడా తెలంగాణ స్టైల్‌లో సర్వ పిండి (Sarva Pindi) తయారీ నెర్చుకో గలుగుతారు.
కావాల్సిన పదార్థాలు:
❁ 1 కప్పు బియ్యప్పిండి (Rice flour)
❁ 1/2 కప్పు శనగపిండి (Bengal gram flour)
❁ చిటికెడు బేకింగ్ సోడా (Baking soda)
❁ 1 టీస్పూన్ జీలకర్ర పొడి (Cumin seeds powder)
❁ 1 టీస్పూన్ మిరియాల పొడి (Black pepper powder)
❁ 1/2 కారం పొడి (Red Chilli powder)
❁ 1/2 టీస్పూన్ పసుపు (Turmeric powder)
❁ రుచికి తగినంత వాము (Salt to taste)
❁ నూనె (Oil)
తయారుచేసే విధానం:
❁ ఒక పెద్ద గిన్నెలో బియ్యప్పిండి, శనగపిండి, బేకింగ్ సోడా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు, వాము మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
❁ కొంచెం కొంచెంగా నీరు పోస్తూ, పొడి పదార్థాలు కలిసేలా పిండి కలుక్కుకోండి. పిండి చాలా గట్టిగా లేదా చాలా పలుచగా ఉండకుండా జాగ్రత్త వహించండి.
❁ ఆ తర్వాత ఒక కళాయిని వేడి చేసి, దానిలో కొద్దిగా నూనె వేయాల్సి ఉంటుంది.
❁ పిండిని ఒక కుంచె సహాయంతో పలుచని పొరలుగా నూనె వేసుకున్న కళాయికి మెత్తాల్సి ఉంటుంది.
❁ ఇలా కళాయికి మొత్తిన సర్వ పిండి బిళ్ల ఒక పక్కం బంగారు రంగులోకి మారిన తర్వాత, మరొక పక్క కూడా దోరగా వేయించండి.
❁ నూనె నుంచి తీసి, కాగితపు పై వేసి నూనెను ఆరనివ్వండి. అంతే వేడివేడిగా సర్వ పిండి (Sarva Pindi) తయారీ అయిన్నట్లే..
ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్..1 గంట ఛార్జ్ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..
సూచనలు:
❁ బియ్యప్పిండి బదులుగా గోధుమపిండి కూడా వాడవచ్చు.
❁ బేకింగ్ సోడా వల్ల సర్వ పిండి బుర్రబురుగా ఉంటుంది. దీనిని వినియోగించనివారు కొద్దిగా నిమ్మరసం వేయవచ్చు.
❁ అంతేకాకుండా మీకు ఇష్టమైనట్లుగా పొడి మసాలా మిశ్రమాన్ని కూడా కలుపుకోవచ్చు.
❁ సర్వ పిండి చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్..1 గంట ఛార్జ్ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter