Today`s horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారు ఏది కోరుకుంటే అది జరిగిపోతుందట

నేటి రాశిఫలాలును పరిశీలిస్తే.. ఈ రాశి వారికి ఇవాళ చాలా బాగుందట. వీళ్లు ఏది తలిస్తే అది అయిపోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరో రాశి వారికి వ్యాపారం బాగా కలిసొస్తుందట. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే విషయాల్లో కలిసొస్తుంది.. ఏయే అంశాల్లో ప్రతికూలతలు ఇబ్బందులు తప్పవో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 4, శనివారం నాటి మీ రాశి ఫలాలుపై ఓ లుక్కేయాల్సిందే.

Updated: Apr 4, 2020, 08:50 AM IST
Today`s horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారు ఏది కోరుకుంటే అది జరిగిపోతుందట

నేటి రాశిఫలాలు పరిశీలిస్తే.. ఈ రాశి వారికి ఇవాళ చాలా బాగుందట. వీళ్లు ఏది తలిస్తే అది అయిపోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరో రాశి వారికి వ్యాపారం బాగా కలిసొస్తుందట. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే విషయాల్లో కలిసొస్తుంది.. ఏయే అంశాల్లో ప్రతికూలతలు ఇబ్బందులు తప్పవో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 4, శనివారం నాటి మీ రాశి ఫలాలుపై ఓ లుక్కేయాల్సిందే.

ఏప్రిల్ 4, శనివారం నాటి మీ రాశి ఫలాలు 

మేష రాశి 4 ఏప్రిల్ 2020 ( మేష రాశి వారి జాతకం )

మీరు ఏదైనా ఒకటి కావాలని బలంగా కోరుకుంటున్నయితే.. దాని కోసం ఇవాళ గట్టిగా ప్రయత్నిస్తే మీరు కోరుకున్నది దక్కే అవకాశాలున్నాయి. మీకు ఈరోజు మరింత అనుకూలంగా ఉండటమే అందుకు కారణం. అయితే, అలాగని మీ మనసులోకి ఎలాంటి చెడు ఆలోచనలు రానీయకండి. ఒక మంచి లక్ష్యాన్ని ఎన్నుకోండి. దానిని సాధించేందుకు పూనుకోండి. అది నెరవేరే అవకాశాలున్నాయి. 

 

 

వృషభ రాశి 4 ఏప్రిల్ 2020 ( వృషభ రాశి వారి జాతకం )

ఈ రోజు మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ జాతకం చెబుతోంది. గత కొన్ని రోజులుగా గ్రహాలు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఏదనుకుంటే అది జరిగేది. అదే మీకూ అలవాటైంది, కానీ ఈ రోజు కొంచెం అందుకు భిన్నంగా ఉంది. మీకు కావాలనుకున్న దాని కోసం కష్టపడాల్సి ఉంటుంది. అందుకే ఇవాళ మీకు సెల్ఫ్ మోటివేషన్ ఎంతైనా అవసరం.

 

 

మిథున రాశి 4 ఏప్రిల్ 2020 ( మిథున రాశి వారి జాతకం )

ఈ రోజు మీరు ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకోవడం సులభం అవుతుంది. ఇవాళ మీరు చాలా స్పష్టమైన స్థితిలో ఉన్నారు కనుక ఏదైనా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఈరోజు మీకు అనుకూలంగా ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. లేదంటే మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో సందిగ్ధంలో ఉన్నారని తెలిస్తే... మీరు వాళ్లు నిర్ణయం తీసుకోవడంలోనూ సహాయపడవచ్చు.

 

కర్కాటక రాశి 4 ఏప్రిల్ 2020  ( కర్కాటక రాశి వారి జాతకం )

మీరు మీ జీవిత నిర్ణయాలు మీ చేతుల్లోకి తీసుకోవటానికి ఇష్టపడతారు మరియు అది మంచి విషయం. మీ శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించి మీరు అనుకున్నది సాధించుకోండి. కానీ అనుకున్నది సాధించే వరకు ఆ విషయాన్ని ఎవ్వరికీ తెలియనివ్వకండి. ఆలోచిస్తే మీరు ఎంతటి శక్తివంతలనే విషయం మీకే అర్థమవుతుంది. అవును.. ఏదైనా సాధించాలని మీరు బలంగా కోరుకుంటే అందుకు మీకు ఎవ్వరి అవసరం లేదు. మీరే గట్టిగా ప్రయత్నిస్తే చాలు.

 

సింహ రాశి 4 ఏప్రిల్ 2020 ( సింహ రాశి వారి జాతకం )

మీకు మీ మనస్సులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. అయితే, అవన్నీ నెరవేరుతాయా లేదా అని ఆందోళన చెందాల్సిన అవసరం అస్సలే లేదు. ఎందుకంటే ఏ పనీ కావడం లేదని మీరు అనుకునే అవకాశాలున్నాయి కానీ అది సరైంది కాదు.. సరైన సమయం కోసం వేచి ఉండండి. ఆ మంచి సమయం త్వరలోనే వస్తుంది. ఈ రోజు ఎక్కువగా ఒత్తిడికి గురికాకుండా అనుకున్నది సాధించుకునే ప్రయత్నం చేయండి.

 

కన్యా రాశి 4 ఏప్రిల్ 2020 ( కన్యా రాశి వారి జాతకం )
ఈ రోజు మీకు తెలిసిన విషయం ఏదైనా ఇతరులతో తెలియజేయాల్సిన అవసరం ఉందని అనిపిస్తే.. దానిని కేవలం మీ మనసులో ఉంచుకోకుండా వెంటనే ఎవరికి చెప్పాలనుకుంటున్నారో వారికి చెప్పేయండి. అప్పుడు అది మీకు మాత్రమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోజు మీరే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి బదులుగా.. ఇబ్బంది లేదనుకుంటే ఇతరుల సహాయం కోరడం మంచిది.

 

తులా రాశి 4 ఏప్రిల్ 2020 ( తులా రాశి వారి జాతకం )

ఈ రోజు మీరు మీ ఒత్తిళ్ల నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం తరువాత మీరు మీ పాత స్నేహితులతో లేదా మీ మనసుకు దగ్గరిగా ఉండే వారితో మాట్లాడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు చాలా మంచిది. ఎందుకంటే మీ మనస్సు ఇవాళ ప్రశాంతంగా ఉంటుంది. మనసులోకి కొత్త ఉత్తేజంతో కూడిన ఆలోచనలు వస్తాయి. తద్వారా మీరు మీ లక్ష్యాలపై ఎక్కువ దృష్టిసారిస్తారు.

 

 

వృశ్చిక రాశి 4 ఏప్రిల్ 2020 ( వృశ్చిక రాశి వారి జాతకం ) 
ఈ రోజు మీరు మీ కంటే చిన్నవారి నుండి సలహా తీసుకునే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో చిన్నవారైనా చాలా విషయాలు తెలుసుకుని ఉంటారు కనుక సమయం, సందర్భం వచ్చినప్పుడు వాళ్ల సహాయం తీసుకోకతప్పదు. ఇవాళ ఈ రాశి వారికి అలాంటి పరిస్తితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇవాళ మీరు ఏదో ఓ కొత్త విషయాన్ని ఎదుర్కునే అవకాశాలు ఉన్నాయని గోచరిస్తోంది. ఆ సందర్భాన్ని అధిగమించే క్రమంలో అవసరమైతే చిన్న వారి సహాయం అయినా తీసుకోవాల్సి ఉంటుందని రాశి ఫలాలు సూచిస్తున్నాయి.

 

ధనుస్సు రాశి 4 ఏప్రిల్ 2020 ( ధనుస్సు రాశి వారి జాతకం )
కొత్త విషయాలను ప్రయత్నించడానికి ఇది సరైన సమయంగా గోచరించడం లేదు. అందుకే ఈ రోజు కొత్త విషయాలతో రిస్క్ తీసుకోకండి. మీకు తెలిసిన విషయాలే చేయండి. అలా అయితే ఈరోజు మీకు మంచే జరుగుతుంది.

 

 

మకర రాశి 4 ఏప్రిల్ 2020 ( మకర రాశి వారి జాతకం )
ఈరోజు మీ వాగ్ధాటి బాగుంటుంది. సాధారణంగా మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడేవారు కూడా ఈ రోజు మిమ్మల్ని ఈజీగానే అర్థం చేసుకుంటారు. మీరు ఏం చెప్పదల్చుకున్నారనే విషయాన్ని మీ చుట్టూ ఉన్న వాళ్లు సులభంగానే అర్థం చేసుకుంటారు. పని విషయంలో ఒకట్రెండు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.

 

 

కుంభ రాశి 4 ఏప్రిల్ 2020 ( కుంభ రాశి వారి జాతకం )

ఈ రోజు మీరు మీ శత్రువుల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. సామాజిక జీవితంలో మీ స్థానాన్ని పొందటానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నించే అవకాశాలున్నాయి. అయితే, అందుకోసం చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మీ నిజమైన స్నేహితులు మీకు ఏదీ జరగనివ్వకుండా అడ్డుకుంటారు. అందుకే ఎక్కువ ఒత్తిడికి గురికాకండి. ఎందుకంటే ఇది కేవలం ఒక దశ మాత్రమే.

 

మీన రాశి 4 ఏప్రిల్ 2020 ( మీన రాశి వారి జాతకం )
ఈ రోజు మీరు ఏదైనా కొత్త సమాచారం తెలుసుకుంటారు. అది కూడా కొత్త మార్గాల్లోనే ఆ సమాచారాన్ని కనుగొంటారు. మీరు రిస్క్ తీసుకోకుండా మీ చుట్టూ ఉన్న వారే మిమ్మల్ని అడ్డుకుంటారు. అయితే, మీరు ఒంటరిగానే ఏదైనా సాధించగల సత్తా తమకు ఉందని నిరూపించేందుకు ప్రయత్నిస్తారు.

 

 

సర్వేజనా సుఖినోభవంతు.