Weight Loss Tips: ఈ ఐదు రకాల ఆహారాలు తీసుకుంటే..బరువు సులభంగా తగ్గుతారు..!!

Weight Loss Tips: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలకు గురవుతున్నారు. చాలా ప్రయత్నాలు చేసిన  బరువు తగ్గడం సమస్యగా మారింది. బీజి లైఫ్ కారణంగా జిమ్‌లో వివిధ రకాల వ్యాయమాలు చేయలేక పోతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 5, 2022, 12:02 PM IST
  • మారుతున్న జీవనశైలి కారణంగా అధిక బరువు
  • గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్‌లో చాలా రకాల విటమిన్లు
  • వోట్మీల్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది
 Weight Loss Tips: ఈ ఐదు రకాల ఆహారాలు తీసుకుంటే..బరువు సులభంగా తగ్గుతారు..!!

Weight Loss Tips: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలకు గురవుతున్నారు. చాలా ప్రయత్నాలు చేసిన  బరువు తగ్గడం సమస్యగా మారింది. బీజి లైఫ్ కారణంగా జిమ్‌లో వివిధ రకాల వ్యాయమాలు చేయలేక పోతున్నారు. అంతేకాకుండా బరువు తగ్గడానికి సహాయపడే ఆహారాలను తీసుకోక పోవడం బరువు తగ్గడం పెద్ద సవాలుగా మారింది. అయితే ఈ ఆహారం తీసుకోవడంలో పలు రకాల నియమాలు తీసుకుంటే సులభంగా పొట్ట చుట్టు కొవ్వు, బరువు తగ్గే అవకాశాలుంటాయని నిపుణులు తెలుపుతున్నారు.

బాదం(Almonds): పీచు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఈ డ్రై ఫ్రూట్‌లో పుష్కలంగా లభిస్తాయి. కావున దీనిని క్రమం తప్పకుండా తింటే ఆకలి తొలగిపోయే అవకాశాలున్నాయి. బాదంపప్పులో కేలరీల శాతం చాలా తక్కువ.

బెర్రీస్(Berries): ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బెర్రీలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువలన ఇది పెరుగుతున్న బరువును నియంత్రించేందుకు ఎంతగానో కృషి చేస్తుంది.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్(Greens Leafy Vegetables): గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్‌లో చాలా రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కావున ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి శరీర బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. కావున ఆహారంలో బచ్చలికూర, బీన్స్, బఠానీలు లేదా బ్రోకలీని తీసుకోవాలి.

వోట్మీల్(Oatmeal)(బియ్యపు పిండితో చేసిన పిండి వంట ): ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆహారంలో కొవ్వు స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని రెగ్యులర్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే శరీరంలోని అదనపు కొవ్వు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.

టోఫు(Tofu): ఇందులో ప్రోటీన్ మూలకాలు అధికంగా ఉంటాయి.  ఇది కండరాలను బలోపేతం చేయడమే కాకుండా పొత్తికడుపు, నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది.

 
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Diabetes Health Tips: షుగర్ అదుపులో ఉండాలంటే.. డయాబెటీస్ పేషేంట్స్ ఈ నీటిని తీసుకుంటే చాలు!

Also Read: Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తప్పక తింటే మీ రక్తంలో షుగర్ పెరగదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News