Nirjala Ekadashi 2023: నిర్జల ఏకాదశి వ్రత సమయంలో గందరగోళం నెలకొందా?, ఈ నియమాలు తప్పని సరి!

Nirjala Ekadashi 2023 Date: నిర్జల ఏకాదశి వ్రత సమయంలో తప్పకుండా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు నియమాలతో ఈ వ్రతాన్ని చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.   

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 28, 2023, 02:03 PM IST
Nirjala Ekadashi 2023: నిర్జల ఏకాదశి వ్రత సమయంలో గందరగోళం నెలకొందా?, ఈ నియమాలు తప్పని సరి!

Nirjala Ekadashi 2023 Date: హిందూ సంప్రాదాయంలో నిర్జల ఏకాదశికి ప్రత్యేక ప్రముఖ్య ఉంది. ప్రస్తుతం చాలా మంది ఏకాదశి ఉపవాసం ఎప్పుడు అనే విషయంపై  గందరగోళ పరిస్థితి నెలకొంది. జ్యోతిష్య శాస్త్రంలో పలు ముఖ్యమైన గ్రహాలు సంచారం చేయడం వల్ల  నిర్జల ఏకాదశి వ్రతాల్లో మార్పులు వచ్చాయి. ఈ రోజు వ్రతంలో ఎంత భక్తితో ఉంటే అన్ని ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. నిర్జల ఏకాదశి ఉపవాసం ఇతర ఏకాదశి ఉపవాసాల కంటే కఠినమైనదిగా చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. అయితే ఈ ప్రాముఖ్యత ఎంటో ఎలాంటి నియమాలతో ఈ వ్రతాన్ని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

నిర్జల ఏకాదశి వ్రత సమయం: 
హిందూ సాంప్రదాయం ప్రకారం..నిర్జల ఏకాదశిని ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజు ఆచరిస్తారు. ఈ సారి నిర్జల ఏకాదశి తేదీ విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. నిర్జల ఏకాదశి వ్రతాన్ని మే 30న ఆచరించాలా లేదా 31న చేయాలా అనే గందరగోళంలో భక్తులు ఉన్నారు. 

నిర్జల ఏకాదశి ఉపవాసం తేదీ, శుభ సమయం:
నిర్జల ఏకాదశిని మే 31, బుధవారం రోజున జరుపుకుంటారు. 
ఏకాదశి తేదీ ప్రారంభ సమయం: మే 30 మధ్యాహ్నం 01:07 నుంచి ప్రారంభమవుతుంది. 
ఏకాదశి తిథి ముగింపు సమయం: మే 31 మధ్యాహ్నం 01:45 గంటలకు
నిర్జల ఏకాదశి వ్రత పరణం జూన్ 1వ తేదీ ఉదయం 05:24 నుంచి 08:10 వరకు..

నిర్జల ఏకాదశి వ్రత పూజ విధానం:

  • గంగాజలంతో ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
  • తెల్లవారుజామున లేచి తలస్నానం చేయాలి.
  • త తర్వాత పట్టు వస్త్రాలు ధరించాలి.
  • గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం.
  • విష్ణుమూర్తికి పూలు, తులసి ఆకులను సమర్పించండి.
  • ఆ తర్వాత స్వామి ఇష్టమైన పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. 
  • ఇలా సమర్పించిన తర్వాత విష్ణుమూర్తికి హారతి ఇవ్వాల్సి ఉంటుంది.
  • పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత భగవంతుని ధ్యానం చేయాలి.

ఏకాదశి ఉపవాస నియమాలు:

  • పన్నెండు నెలల పాటు ఏకాదశి వ్రతం పాటించలేని వారు నిర్జల ఏకాదశి వ్రతాన్ని తప్పక పాటించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 
  • ఉపవాస నియమాలు ఒక్క రోజు సాయంత్రం ముందే ప్రారంభమవుతాయి. వ్రతాన్ని ఆచరించే రోజు ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.  
  • ఈ క్రమంలో ఎలాంటి ఆహారాలు తినొద్దు.
  • ఉదయం స్నానం చేసి.. పట్టు వస్త్రాలు ధరించి, పసుపు బట్టలు ధరించాలి.
  • పూజానంతరం కథ విని, శ్రీమహావిష్ణువును ధ్యానిస్తూ ఉండాలి.
  • ఈ క్రమంలో నీటిని తాగ కూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 
  • అంతేకాకుండా ఈ క్రమంలో చెడు ఆలోచనలు ఉండకూడదు.
  • శ్రీమహావిష్ణువును ధ్యానిస్తూ ఆయన మంత్రాలను జపించాలి.
  • ఈ రోజు నిరుపేదలకు అన్నం, బట్టలు సమర్పించాల్సి ఉంటుంది.
  •  
  • Also Read:  Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి

  • స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

    ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

    ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

    మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News