White Hair To Black Hair: ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారాపు అలవాట్ల కారణంగా చాలా మందిలో తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు పెద్ద వయసులోని వారిలోనే కాకుండా చిన్న వయసు గల వారిలో కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తెల్ల జుట్టును నియంత్రించే పలు ఆహారాలు కూడా తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు సమస్యలేకాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. కాబట్టి తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
తెల్ల జుట్టు ఉన్నవారు తప్పకుండా ఈ ఆహారాలు తీసుకోవాలి:
బాదంపప్పులు:
బాదంపప్పుల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమేకాకుండా తెల్ల జుట్టు, జుట్టు రాలడం సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ఇందుల యాంటీఆక్సిడెంట్స్ కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి జుట్టు కుదుళ్ల నుంచి బలంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బచ్చలికూర:
జుట్టును సంరక్షించేందుకు బచ్చలికూర కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనిలో ఐరన్, విటమిన్ ఎ, సి, ఫోలేట్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా బచ్చలికూరను సలాడ్స్‌లో ఆహారంలో తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా జుట్టుకు సహజమైన కండీషనర్‌ను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. డీఏ పెంపుపై క్లారిటీ
స్వీట్ పొటాటో:
తెల్ల జుట్టును నియంత్రించేందుకు స్వీట్ పొటాటో కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి తీవ్ర జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కూడా సహాయపడుతుంది. ఈ స్వీట్ పొటాటోలో విటమిన్ ఎ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి జుట్టును దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది.
బెర్రీలు:
యాంటీఆక్సిడెంట్ల అధిక పరిమాణంలో లభించే పండ్లలో బెర్రీలు కూడా ఒకటి. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి హెయిర్ ఫోలికల్స్‌ను రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి జుట్టు నెరసిపోకుండా సహాయపడుతుంది.
పుట్టగొడుగులు:
పుట్టగొడుగులను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు సమస్యలు శాశ్వతంగా దూరమవుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే పోషకాలు మెలనిన్ ఉత్పత్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారే తప్పకుండా పుట్టగొడుగులను వినియోగించాల్సి ఉంటుంది.
Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. డీఏ పెంపుపై క్లారిటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి