Iphone 13 Get @25999 on Flipkart : ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్టులో ఎలక్ట్రిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ముఖ్యంగా టీవీ, వాషింగ్ మెషిన్స్పైనే కాకుండా స్మార్ట్‌ఫోన్స్‌పై కూడా ఆఫర్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం స్మార్ట్ మొబైల్స్ ప్రత్యేక ధరల్లో విక్రయిస్తోంది. ముఖ్యంగా యాపిల్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్స్ ప్రత్యేక సేల్స్‌లో భాగంగా భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ప్రత్యేక సేల్‌లో యాపిల్ ఐఫోన్ 13 డెడ్ ఛీప్‌గా లభిస్తోంది. ఈ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు ఇప్పుడు కొనుగోలు చేస్తే సగం ధరకే లభిస్తుంది. ఎక్కువ డిస్కౌంట్‌తో ఎలా ఐఫోన్ 13 కొనుగోలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
2021లో ఐఫోన్ 13ను కంపెనీ విడుదల చేసింది. అయితే దీనిని రూ. 79,900 ధరతో మొదట మార్కెట్లో విక్రయించగా..వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రేట్లను తగ్గిస్తూ వచ్చాయి. ఆ తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్టులో రూ. 48,850 తగ్గింపు అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఐఫోన్ 13 డెడ్ ఛీప్‌గా లభిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్టులో రూ. 61,999లకు లభిస్తోంది. కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని 11 శాతం విక్రయిస్తోంది. ఈ మొబైల్‌ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే దాదాపు రూ. 1000 డిస్కౌంట్ పొందవచ్చు.
Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్ జాయ్ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?
ఎక్చేంజ్ ఆఫర్:
ఐఫోన్ 13పై ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్చేంజ్ చేస్తే భారీ డిస్కౌంట్ పొందవచ్చు. మీరు ఈ ఆఫర్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 35,000 దాకా తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు అన్ని ఆఫర్లు పోను ఈ మొబైల్‌ను రూ. 25,999 పొందవచ్చు. ఈ బ్రాండ్ మొబైల్స్‌పై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఆఫర్లు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ఫ్లిప్‌కార్టును సందర్శించాల్సి ఉంటుంది.
ఐఫోన్ 13 ఫీచర్లు:
✹ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే
✹ ఫ్లాగ్షిప్ A15 బయోనిక్ చిప్సెట్
✹ 4K డాల్బీ విజన్
✹ HDR రికార్డింగ్‌తో 12MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
✹ నైట్ మోడ్‌తో 12MP TrueDepth ఫ్రంట్ కెమెరా
✹ 17 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్
Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్ జాయ్ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి