Monsoon Health Tips: వేడి వాతావరణంగా నుంచి ఉపశమనం లభించింది. భారత్‌లో వానా కాలం ఈ నెల రెండవ వారం నుంచి ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. అయితే దీని కారణండా వాతారణంలో తేమ శాతం ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతో చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జ్వరం, గొంతు నొప్పి ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ చిట్కాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది:
గోరువెచ్చని నీటిని తాగాల్సి ఉంటుంది:
వానా కాలంలో చాలా మందిలో జ్వరం, జలుబు వంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆహారాల్లో ఉప్పును తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది:
వర్షాకాలంలో ఆహారాలు తీసుకునే క్రమంలో ఉప్పు తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే అధిక రక్తపోటు వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా మధుమేహం, గుండెపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఉప్పు, చక్కెర పరిమాణాలు తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Guntur Karam Movie: 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే ఔట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?
సీజనల్ పండ్లు మాత్రమే ప్రతి రోజు తినాలి:
చాలా మంది మార్కెట్లో లభించే అన్ని రకాల పండ్లను తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వాటిపై ఉండే క్రిములు శరీరంలోకి సోకే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజు బొప్పాయి, యాపిల్స్, పుచ్చకాయలను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు ఇన్ఫెక్షన్స్ నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తప్పని సరిగా తీసుకోవాలి:
వానా కాలంలో శరీరంలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గుతుంది. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా గుమ్మడికాయ, డ్రై ఫ్రూట్స్‌ను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Also Read: Guntur Karam Movie: 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే ఔట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి