Bay Leaf Tea Reduces Uric Acid: బిర్యానీలో వినియోగించి బే ఆకులు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. అయితే చాలామంది ఈ ఆకులను ఆహారాల్లో కరివేపాకు తీసేసినట్టు బయట పడేస్తారు. కానీ ఈ ఆకుల వల్ల శరీరానికి 100 రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులతో తయారుచేసిన డికాషన్ ను ప్రతిరోజు తాగితే ఎన్నో రకాల వ్యాధులకు ఔషధంలా పనిచేస్తుంది.
ప్రస్తుతం చాలామంది కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు బే ఆకులను నీటిలో ఉడికించి ఆ నీటిని తాగితే సులభంగా యూరిక్ యాసిడ్ సమస్యల నుంచి బయటపడచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బిర్యానీ ఆకుల టీలో ఉండే పోషకాలు శరీరాన్ని యాక్టివ్ గా చేసేందుకు కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ టీని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది.
Also Read: Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో స్టార్లుగా ఎదిగిన ప్లేయర్లు వీళ్లే..!
బయట లభించే స్ట్రీట్ ఫుడ్ అతిగా తినడం కారణంగా చాలామందిలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి, ఊబకాయం సమస్య బారిన పడుతున్నారు. ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే చాలా రకాల ఔషధాలను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ అతిగా పెరగడం కారణంగా తీవ్ర గుండె సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీలైనంత తొందరగా కొలెస్ట్రాలను తగ్గించుకోవడం చాలా మంచిది. అయితే బే ఆకుల టీ శరీరంలోని కొలెస్ట్రాల్ ను కూడా ఎంతో ప్రభావంతంగా కరిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
బిర్యానీ ఆకుల టీ ని వానాకాలంలో ప్రతిరోజు ఉదయం తాగడం వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటికి పంపేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలిపారు. ఈ టీ లో ఉండే మూలకాలు జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. తరచుగా మలబద్ధకం పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఈ టీ ని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో స్టార్లుగా ఎదిగిన ప్లేయర్లు వీళ్లే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి