Sun transit 2023: సూర్యుడి అశ్లేష నక్షత్ర పరివర్తనం, ఆ మూడు రాశులకు వద్దంటే డబ్బులు

Sun transit 2023: హిందూమత విశ్వాసాల ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి ఎనలేని మహత్యముంది. గ్రహాల గోచారం కచ్చితంగా ఇతర రాశులపై ప్రతికూల లేదా అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అందుకే గ్రహాల గోచారాన్ని చాలా జాగ్రత్తగా అంచనా వేస్తుంటారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 4, 2023, 03:31 PM IST
Sun transit 2023: సూర్యుడి అశ్లేష నక్షత్ర పరివర్తనం, ఆ మూడు రాశులకు వద్దంటే డబ్బులు

Sun transit 2023: ప్రస్తుతం ఆ మూడు రాశులవారికి మంచి సమయం ప్రారంభమైందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సూర్యుడి గోచారం ప్రభావం ఇందుకు కారణం. సూర్యుడి నక్షత్ర పరివర్తనం వల్ల ఆ మాడు రాశుల జాతకాలకు అంతులేని ధన సంపదలు కలగనున్నాయి.

జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి ఎలాంట ప్రాధాన్యత ఉంటుందో నక్షత్ర గోచారం లేదా నక్షత్ర పరివర్తనానికి కూడా అంతే మహత్యముంటుంది. గ్రహాల గోచారానికి ఉన్నట్టే నక్షత్ర గోచారం కూడా మనిషి జీవితంపై పెను ప్రభావం చూపిస్తుంది. జూలై 16వ తేదీన సూర్యుడి కర్కాటక రాశిలో ప్రవేశించి ఉన్నాడు. నిన్న అంటే ఆగస్టు 3వ తేదీన సూర్యుడు నక్షత్ర గోచారం ద్వారా అశ్లేష నక్షత్రంలో ప్రవేశించాడు. ఈ నెల అంటే ఆగస్టు 17 మద్యాహ్నం 1 గంట 44 నిమిషాసల వరకూ ఇదే నక్షత్రంలో ఉంటాడు. సూర్యుడి నక్షత్ర పరివర్తనం ప్రభావం వాస్తవానికి అన్ని జాతకాలపై పడినా..ప్రత్యేకించి మూడు రాశులకు మాత్రం విశేషమైన లాభాల్ని ఆర్జించి పెడుతుంది. అశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు కావడంతో శుభ, అశుభ ఫలాలు కలగనున్నాయి. 

వృషభ రాశి జాతకులకు సూర్యుడి నక్షత్ర పరివర్తనం కారణంగా కీలకమైన రంగాల్లో విజయం లభించవచ్చు. మీరు ఎదురుచూసే పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభించవచ్చు. చాలాకాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. కష్టపడినవారికి మరింత ఎక్కువ ప్రయోజనాలుంటాయి. ఆర్ధికంగా ఏ విధమైన ఇబ్బంది ఎదురు కాదు. ఆరోగ్యం లక్షణంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలుంటే తొలగిపోతాయి. 

సింహ రాశికి గురువైన సూర్యుడు అశ్లేష నక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి అద్భుతమైన ప్రయోజనాలు అన్ని విధాలా కలగనున్నాయి. చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. అమితమైన ధనలాభం కలుగుతుంది. దీర్ఘకాలంగా నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారం విస్తృతమైన అమితమైన లాభాలు ఆర్జించగలరు. ఎప్పుడో గతంలో ఎక్కడో నిలిచిపోయిన డబ్పులు తిరిగి చేతికి అందుతాయి. నాయకత్వ లక్షణాలు అభివృద్ధి కావడంతో విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. 

సూర్యుడు నక్షత్ర పరివర్తనంతో అశ్లేష రాశిలో ప్రవేశించడం వల్ల అద్భుతమైన లాభం కలగనుంది. ప్రత్యేకించి ప్రభుత్వ రంగంలో పనిచేసేవారికి ఎప్పట్నించో ఎదురుచూస్తున్న పదోన్నతి కలుగుతుంది. ఇక బదిలీ విషయమైతే కోరుకున్న చోటికి వెళ్లవచ్చు. కుటుంబంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ఆర్ధికంగా ఎలాంటి సమస్యలు ఎదురుకావు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

Also read: Bhadra Rajyoga 2023: ఈ రాశులవారిపై భద్ర రాజయోగం ప్రభావం.. 30 రోజు పాటు ఊహించని లాభాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News